Suzuki : సుజుకి తన బర్గ్‌మన్ స్ట్రీట్, యాక్సెస్, అవెనిస్ మోడళ్లపై రూ.5,000 క్యాష్‌బ్యాక్ తగ్గింపును అందిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, ఎటువంటి షరతులు లేకుండా 100 శాతం వరకు రుణం కూడా అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్‌లు పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటాయని వినియోగదారులు గమనించాలి. ఈ ఆఫర్‌ల గురించి మరింత సమాచారం కోసం ఆసక్తిగల కస్టమర్‌లు తమ సమీపంలోని డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు.
Also Read : మధ్యతరగతి ప్రజలకు 8లక్షల లోపు బెస్ట్ బడ్జెట్ కార్లు ఇవే!
సుజుకి అవెనిస్
సుజుకి అవెనిస్ OBD-2B ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 93,200. ప్రత్యేక ఎడిషన్ ధర రూ. 94,000. స్టాండర్డ్ మోడల్ 4 కలర్ ఆఫ్షన్లలో లభిస్తుంది. సుజుకి అవెనిస్‌లో 124.3cc 4-స్ట్రోక్ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ అద్భుతమైన యాక్సిలరేషన్, చురుకైన హ్యాండ్లింగ్‌ను కొనసాగిస్తూనే మంచి రైడింగ్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి తయారు చేసింది. ఇది అడ్వాన్స్‌డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో పాటు సుజుకి ఎకో పెర్ఫార్మెన్స్ (SEP) టెక్నాలజీని కూడా కలిగి ఉంది.
సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్
కొత్తగా అప్‌డేట్ చేయబడిన సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ ఎక్స్ ప్రారంభ ధర రూ. 1,16,200, అయితే బర్గ్‌మన్ స్ట్రీట్ ప్రారంభ ధర రూ. 95,800. బర్గ్‌మన్ స్ట్రీట్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. టాప్-టైర్ EX వేరియంట్ మూడు రంగుల్లో లభిస్తుంది. బేస్ వేరియంట్‌లో ఏడు రంగులు ఉన్నాయి. అప్‌డేట్ చేయబడిన బర్గ్‌మన్‌లో సుజుకి అవెనిస్‌లో కనిపించే ఆల్-అల్యూమినియం, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్ 124.3cc OBD-2B కంప్లైంట్ ఇంజన్ అమర్చబడి ఉంది. దీని పవర్ అవుట్‌పుట్ 8.5 bhp, టార్క్ 10 Nm.
సుజుకి యాక్సెస్
అప్‌డేట్ చేయబడిన సుజుకి యాక్సెస్ 125 మూడు వేరియంట్లు, ఐదు కలర్ ఆఫ్షన్లలో వస్తుంది. ఇది బ్లూటూత్ కన్సోల్‌తో మెరుగైన పర్ఫామెన్స్, అధిక మైలేజ్, మంచి రైడింగ్‌తో లభిస్తుంది. దీని ధర రూ.81,700 నుండి ప్రారంభమవుతుంది. ఇది ఇప్పుడు యూరో 5+ ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. అప్‌డేట్ చేయబడిన యాక్సెస్ 125 స్టాండర్డ్, స్పెషల్, రైడ్ కనెక్ట్ ఎడిషన్ అనే మూడు వేరియంట్‌లలో అందించబడుతుంది. ఇది సాలిడ్ ఐస్ గ్రీన్, పెర్ల్ షైనీ బేజ్, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నంబర్ 2 వంటి ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.