Wagon R Hybrid: వ్యాగన్ ఆర్ హైబ్రిడ్ వచ్చేస్తుంది .. ఏకంగా 40 కి.మీల మైలేజ్.. ఫీచర్లు చూస్తే దిమ్మదిరగాల్సిందే

ఆటోమోబైల్ మార్కెట్లోకి ఎన్నో కార్లు వచ్చినా వ్యాగన్ ఆర్ వన్నె తగ్గలేదు. హ్యాచ్ బ్యాక్ వేరియంట్ లో, లో బడ్జెట్ లో ఇలా ఎటూ చూసినా వ్యాగన్ ఆర్ మంచి కారుగా ఆదరణ పొందింది.

Written By: Chai Muchhata, Updated On : June 29, 2024 3:21 pm

Wagon R Hybrid

Follow us on

Wagon R Hybrid: దేశంలోని కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తోంది మారుతి. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఆకట్టుకునే మోడల్స్ వచ్చాయి. వీటిలో వ్యాగన్ ఆర్ ఎవర్ గ్రీన్ గా నిలుస్తుంది. దశాబ్దాలుగా వ్యాగన్ ఆర్ కు ఆదరణ తగ్గడం లేదు. అయితే ఈ వ్యాగన్ ఆర్ ను కొత్తగా హైబ్రిడ్ కారుగా మార్కెట్లోకి తీసుకురాబోతుంది మారుతి. ఈ సరికొత్త వెర్షన్ వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి వచ్చే అవకాశం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాథమిక వివరాలు ఆన్ లైన్ లో ఉంచారు. దీంతో ఈ కారు గురించి తెలుసుకున్న వారు వ్యాగన్ ఆర్ హైబ్రిడ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకీ వ్యాగన్ ఆర్ హైబ్రిడ్ ఎలా ఉండబోతుందంటే?

ఆటోమోబైల్ మార్కెట్లోకి ఎన్నో కార్లు వచ్చినా వ్యాగన్ ఆర్ వన్నె తగ్గలేదు. హ్యాచ్ బ్యాక్ వేరియంట్ లో, లో బడ్జెట్ లో ఇలా ఎటూ చూసినా వ్యాగన్ ఆర్ మంచి కారుగా ఆదరణ పొందింది. వ్యాగన్ ఆర్ కు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని మారుతి కంపెనీ దీనిని హైబ్రిడ్ వేరియంట్ లో ఉత్పత్తి చేయబోతున్నారు. కొంత సమాచారం మేరకు 2025లో ఇది మార్కెట్లోకి రానుంది. కొత్త కారులో పెట్రోల్ ఇంజిన్ హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇది మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ తో పెట్రోల్ ఇంజిన్ ను కలపడం ద్వారా లీటర్ ఇంధనానికి 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

వ్యాగన్ ఆర్ హైబ్రిడ్ గురించి అధికారిక వివరాలు ఇంకా వెల్లడించలేదు. కానీ కొన్ని సంస్థలు మాత్రం దీనిని అంచనా వేస్తున్నాయి. వారి ప్రకారం ఈ కారులో 1.2 లీటర్ డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ఉండనుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉండనుంది. 90 బీహెచ్ పీ పవర్ వద్ద 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త మారుతి హైబ్రిడ్ డిజైన్ సరికొత్తగా ఉండనుంది. ఇది టాల్ బాయ్ డిజైన్ ను మెయింటెయిన్ చేస్తుందని అంటున్నారు. ఫ్రంట్ గ్రిల్, అప్డేట్ చేయబడిన బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్స్, వీల్ డిజైన్లు వంటివి అప్డేట్ చేయనున్నారు.

హైబ్రిడ్ కారులో సేప్టీ ఫీచర్స్ ఎక్కువే. ఇందులో డ్యూయెల్ ఎయిర్ బ్యాగులు, EBD, ABS లతో కూడిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో ఉన్న టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అల్లాయ్ వీల్స్ వంటివి ఆకర్షిస్తాయి. వ్యాగన్ ఆర్ హైబ్రిడ్ లా మారుతున్నా.. ధరలో పెద్దగా మార్పులేదు. దీనిని రూ.7.5 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు విక్రయించనున్నారు.