spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Pothineni: సొంతంగా కథ రాసుకున్న హీరో రామ్ పోతినేని..డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Ram Pothineni: సొంతంగా కథ రాసుకున్న హీరో రామ్ పోతినేని..డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Ram Pothineni: ఈమధ్య కాలంలో పాపం హీరో రామ్ పోతినేని(Ram Pothineni) కి అసలు ఏది కలిసి రావడం లేదు. ‘ఇష్మార్ట్ శంకర్’ చిత్రం తో భారీ కమర్షియల్ హిట్ ని అందుకున్న రామ్ పోతినేని, ట్రాక్ లోకి వచ్చేసాడు, ఇకపై అన్నీ సూపర్ హిట్ సినిమాలే చేస్తాడు అని అంతా అనుకున్నారు. ఆ దిశగానే ఆయన కాంబినేషన్స్ కూడా సెట్ చేసుకున్నాడు. కానీ అవి వర్కౌట్ అవ్వలేదు. ‘ఇష్మార్ట్ శంకర్’ తర్వాత విడుదలైన ‘రెడ్’ చిత్రం యావరేజ్ రేంజ్ లో ఆడింది. కానీ ఆ తర్వాత విడుదలైన ‘ది వారియర్’, ‘స్కంద’, ‘డబుల్ ఇష్మార్ట్’ వంటి సినిమాలు ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. రీసెంట్ గా ఆయన నుండి విడుదలైన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కమర్షియల్ గా ఈ చిత్రం కూడా వర్కౌట్ అవ్వలేదు.

దీంతో ఇప్పుడు రామ్ కెరీర్ డైలమా లో పడింది. ఎలాంటి సినిమా చెయ్యాలో అర్థం అవ్వని పరిస్థితి. దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్ లో ఆయన ఒక కథ ని సొంతంగా రాసుకోవాలని అనుకుంటున్నాడట. స్టోరీలైన్, బేసిక్ స్టోరీ మొత్తం రెడీ అయ్యింది అట. పూర్తి స్థాయి బౌండెడ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేయడం ఒక్కటే బ్యాలన్స్ అది. బౌండెడ్ స్క్రిప్ట్ కూడా రామ్ నే సిద్ధం చేస్తాడట. ఆయన తీసుకున్న ఈ గ్యాప్ లో స్క్రిప్ట్ ని రెడీ చేస్తాడని, డైలాగ్ వెర్షన్ కూడా ఆయనే రాస్తాడని టాక్. ఈ చిత్రానికి డైరెక్టర్ గా ఎవరు వ్యవహరించబోతున్నాడు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. కెరీర్ లో వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న సమయంలో రామ్ ని మళ్లీ సక్సెస్ ట్రాక్ లో పెట్టిన చిత్రం ‘నేను శైలజ’.

కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత రామ్ వెంటనే అతనితో ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ అనే చిత్రం చేశాడు. ఇది కూడా కమర్షియల్ గా హిట్ అయ్యింది. ఇలా అప్పటి నుండే కిషోర్ తిరుమల తో రామ్ కి మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు రామ్ సొంతంగా తయారు చేయబోతున్న స్క్రిప్ట్ ని కిషోర్ తిరుమల చేతిలో పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట రామ్. ఇంకా ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ ని కూడా ఆయన పరిశీలిస్తున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ అధికారికంగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రామ్ తన గత చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ లో ‘నువ్వెంటే చాలే’ వంటి బ్లాక్ బస్టర్ పాటకు లిరిక్ రైటర్ గా పని చేశాడు. కాబట్టి ఆయనకు రైటింగ్ మీద గ్రిప్ గట్టిగానే ఉంది. చూడాలి మరి రామ్ ఈ కొత్త అవతారంలో ప్రేక్షకులను అలరిస్తాడా లేదా అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version