https://oktelugu.com/

Post Office:  పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రోజుకు రూ.416 ఆదా చేస్తే రూ.65 లక్షలు?

Post Office:  పోస్టాఫీస్ లో ఎన్నో స్కీమ్స్ ఉండగా ఆ స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో రోజుకు 416 రూపాయలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 8, 2022 / 04:23 PM IST
    Follow us on

    Post Office:  పోస్టాఫీస్ లో ఎన్నో స్కీమ్స్ ఉండగా ఆ స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో రోజుకు 416 రూపాయలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 65 లక్షల రూపాయలు పొందవచ్చు.

    పోస్టాఫీస్ లో ఇతర స్కీమ్స్ తో పోలిస్తే ఈ స్కీమ్ పై ఎక్కువ వడ్డీ లభిస్తోంది. నెలకు ఈ స్కీమ్ లో 5,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 25 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలను మాత్రమే ఈ స్కీమ్ లో చేర్చవచ్చు.

    పోస్టాఫీస్ లేదా సమీపంలో బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో 15 సంవత్సరాల వరకు డబ్బులను ఇన్వెస్ట్ చేయాల్సి ఉండగా 21 సంవత్సరాల తర్వాత అకౌంట్ మెచ్యూరిటీ అవుతుంది. గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల పేర్లపై ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కనీసం 1,000 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

    ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను కూడా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.