Adhar Card: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అర్హత పొందడానికి అవసరమైన ముఖ్యమైన కార్డులలో ఆధార్ కార్డ్ ఒకటనే విషయం తెలిసిందే. ఆధార్ కార్డ్ లేనివాళ్లు నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పుట్టిన పిల్లలకు సైతం ఆధార్ కార్డ్ సులువుగా పొందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించాయి. అయితే ఆధార్ కార్డ్ ఫోటోల విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
ఆన్ లైన్ లో లేదా మాన్యువల్ గా ఆధార్ కార్డ్ ఫోటోను మార్చుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇందుకోసం మొదట https://uidai.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అందులో మై ఆధార్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత డౌన్ లోడ్స్ అనే సెక్షన్ ను ఎంచుకుని ఆధార్ ఎన్ రోల్ మెంట్ లేదా అప్ డేట్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫామ్ ను ఫిల్ చేసి ఆధార్ కేంద్రంలో పని చేసే ఎగ్జిక్యూటివ్ కు సమర్పించాలి.
ఆ తర్వాత బయోమెట్రిక్ వివరాలను అందజేసి 100 రూపాయలు చెల్లించాలి. ఆ తర్వాత అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను తీసుకొని స్టేటస్ ను చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే కొత్త ఫోటోతో ఉన్న కొత్త ఆధార్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.