Post Office: పోస్టాఫీస్ లో ఎన్నో స్కీమ్స్ ఉండగా ఆ స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో రోజుకు 416 రూపాయలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 65 లక్షల రూపాయలు పొందవచ్చు.
పోస్టాఫీస్ లో ఇతర స్కీమ్స్ తో పోలిస్తే ఈ స్కీమ్ పై ఎక్కువ వడ్డీ లభిస్తోంది. నెలకు ఈ స్కీమ్ లో 5,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 25 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలను మాత్రమే ఈ స్కీమ్ లో చేర్చవచ్చు.
పోస్టాఫీస్ లేదా సమీపంలో బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో 15 సంవత్సరాల వరకు డబ్బులను ఇన్వెస్ట్ చేయాల్సి ఉండగా 21 సంవత్సరాల తర్వాత అకౌంట్ మెచ్యూరిటీ అవుతుంది. గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల పేర్లపై ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కనీసం 1,000 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను కూడా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Sukanya samriddhi yojana save income tax do these before march 31
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com