Post Office : ఈ స్కీమ్స్ లో మీరు చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం వలన దీర్ఘకాల వ్యాధిలో భారీ మొత్తంలో రాబడి పొందవచ్చు. ప్రభుత్వ హామీతో ఉన్న పోస్ట్ ఆఫీస్ పథకాలలో పెట్టుబడి పెట్టడం వలన కూడా మీకు ఖచ్చితమైన సురక్షితమైన రాబడి అందుతుంది. గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండుసార్లు రేపో రేటును తగ్గించిన క్రమంలో అనేక బ్యాంకులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గించాయి. ఈ క్రమంలో చాలామంది బ్యాంకులో కంటే పోస్ట్ ఆఫీస్ లో పెట్టుబడి పెట్టడం మంచిది అని భావిస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ లో మీరు మంచి వడ్డీ రేటు తో పాటు టాక్స్ బెనిఫిట్స్ కూడా పొందే అవకాశం ఉంది. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ లో మీరు లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు మెచ్యూరిటీ సమయానికి ఎంత రాబడి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న అద్భుతమైన స్కీమ్స్ లో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ డిపాజిట్ స్కీం కూడా ఒకటి. ఈ స్కీమ్ లో మీరు ఐదేళ్ల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ స్కీంకు పోస్ట్ ఆఫీస్ 7.7% వడ్డీని అందిస్తుంది.మీరు నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ డిపాజిట్ స్కీంలో ఒకేసారి ఐదు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 7.7% వడ్డీ రేటు తో మీకు రూ.2,24,517 వడ్డీ లభిస్తుంది. అంటే మెచ్యూరిటీ సమయానికి మీరు మొత్తం రూ.7,24,517 అందుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ స్కీమ్లో 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే 7.7% వడ్డీ రేటు ప్రకారం మీకు రూ.1,79,614 వడ్డీ లభిస్తుంది. అంటే మెచ్యూరిటీ సమయానికి మీకు మొత్తం రూ.5,79,614 అందుతాయి.
Also Read : కేవలం 5 ఏళ్లలో రూ.14 లక్షలు పొందొచ్చు.. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న సూపర్ డూపర్ పథకం ఇదే..
ఒకవేళ మీరు నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ డిపాజిట్ స్కీమ్లో 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే 7.7% వడ్డీ రేటు ప్రకారం మీకు రూ.1,34,710 వడ్డీ లభిస్తుంది. అంటే మీరు మూడు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి మీరు మొత్తం రూ.4,34,710 అందుకోవచ్చు. ఒకవేళ మీరు రెండు లక్షల రూపాయలు ఈ స్కీముల డిపాజిట్ చేసినట్లయితే 7.7 శాతం వడ్డీ రేటు ప్రకారము మీరు రూ.89,807 వడ్డీ పొందవచ్చు. మెచ్యూరిటీ సమయానికి మీరు రూ.2,89,807 పొందవచ్చు. ఒకవేళ కనిష్టంగా మీరు లక్ష రూపాయలు ఈ స్కీంలో పెట్టుబడి పెట్టినట్లయితే 7.7% వడ్డీ రేటు ప్రకారం మీరు మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ.1,44,903 పొందవచ్చు.