Common Man : ముఖ్యంగా ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ లో జన సురక్ష పథకం సామాన్య ప్రజల కోసం అమలు చేస్తుంది. ప్రతి ఒక్కరి జీవితం కూడా ఎల్లప్పుడూ రిస్క్ లోనే ఉంటుంది. ఎప్పుడు ఏ ఆర్థిక సమస్య ఎదురవుతుందో ఎవరికీ తెలియదు. ఇటువంటి సమస్యలను ఎదురుకోవడానికి నిత్యం మనం సిద్ధంగా ఉండాలి. ఈ క్రమంలో చాలామంది ఆర్థికంగా కొంచెం బలంగా ఎదిగిన సమయంలో వివిధ రకాల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టుబడి పెట్టి తమ భవిష్యత్తును సెక్యూర్ గా మార్చుకుంటున్నారు. తక్కువ ఆదాయం పొందుతున్న వారు ఈ ప్రక్రియలో వెనకబడతారు. ఇటువంటి వారి కోసం ప్రభుత్వం వారి భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు అనేక పథకాలను రూపొందించింది. ఇటువంటి పథకాలలో పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న జన్ సురక్ష పథకం కూడా ఒకటి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన అనే పథకాలు మీకు భవిష్యత్తులో కష్ట సమయంలో భద్రతను కల్పిస్తాయి. ఈ పథకాలు తక్కువ ప్రీమియం తో సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాయి. వృద్ధాప్యంలో ఫిక్స్డ్ ఆదాయం అందించే పెన్షన్ పథకం అటల్ పెన్షన్ యోజన పథకం.
ఇది ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు బాగా సహాయపడుతుంది. మీరు పెట్టుబడి పెట్టిన దానిపై మీకు 60 ఏళ్ల వయసు పూర్తి అయిన తర్వాత మీకు 1000 రూపాయలు నుంచి 5000 వరకు ప్రతినెల పెన్షన్ అందుతుంది. మీరు ఎంచుకున్న పెన్షన్ అమౌంట్ పై అలాగే మీరు పెట్టే పెట్టుబడిపై ప్రతినెలా ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అటల్ పెన్షన్ యోజన పథకంలో 20 ఏళ్ల వ్యక్తి ప్రతినెల 5000 పెన్షన్ పొందడానికి అతను ఈ పథకంలో నెలకు 50 రూపాయల నుంచి 2500 వరకు చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాలో ఉన్న 18 నుండి 40 ఏళ్ల వయసు గల భారతీయ పౌరులు ఈ పథకానికి అర్హులు.
Also Read : ఇదేం జాబ్ రా స్వామీ.. నిద్రపోతూ నెలకు రూ.26 లక్షలు సంపాదన
మీరు ఇందులో 60 ఏళ్ల వయసు వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మీరు ప్రీమియం చెల్లించడానికి నెలవారీ, మూడు నెలలకు ఒకసారి, అర్థ వార్షిక లేదా వార్షికంగా ఆప్షన్స్ ఉంటాయి. మీకు 60 ఏళ్లు పూర్తయిన తర్వాత ప్రతినెలా పెన్షన్ రావడం మొదలవుతుంది. ఒకవేళ మీరు మరణించినట్లయితే మీ జీవిత భాగస్వామికి ప్రతినెలా పింఛన్ అందుతుంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం అనేది ఒకవేళ మీరు దురదృష్టవశాత్తు మరణించినట్లయితే మీ కుటుంబానికి అండగా నిలిచే లైఫ్ ఇన్సూరెన్స్ పథకం. పాలసీదారుడు ఈ పథకంలో మరణించినట్లయితే అతని కుటుంబ అవసరాలను తీర్చడానికి అతని కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు అందుతుంది.