2026 కొత్త సంవత్సరం సందర్భంగా చాలా మొబైల్స్ కంపెనీలు కొత్త డివైస్లను వినియోగదారులకు పరిచయం చేస్తున్నాయి. ఇందులో భాగంగా Sony కంపెనీ తన వినియోగదారులకు కొత్తగా ఫ్లాగ్ ఫిష్ స్మార్ట్ మొబైల్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నాణ్యమైన ఫోటోలు తీసే కెమెరా, మెరుగైన బ్యాటరీ అందించే ఈ మొబైల్ యూత్ తో పాటు అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే దీని డిజైన్ చూస్తే వెంటనే కొనుగోలు చేయాలని అనుకుంటారు. మల్టిమీడియా వీడియోలు చూసే వారితోపాటు గేమింగ్ కోరుకునే వారికి ఇది అద్భుతంగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మరి దీని వివరాల్లోకి వెళ్తే..
Sony కంపెనీకి చెందిన ఎక్స్పీరియా అనే మొబైల్ మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకుంటుంది. ఇది చూడడానికే ప్రొఫెషనల్ లుక్ లో కనిపిస్తుంది. అద్భుతమైన సన్నని డిజైన్ ను కలిగి ఉండి చేతిలో పట్టుకునేందుకు సులభంగా ఉంటుంది. అలాగే దీని డిస్ప్లే వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఇది 6.7 అంగుళాల 4K OLED Display తో పనిచేస్తుంది. ఇది 120 Hz రిఫ్రిష్ రేటుతో తో ఉండడంతో మృదువైన స్క్రోలింగ్ తో పాటు క్వాలిటీ వీడియోలను వీక్షించే విధంగా అనుగుణంగా ఉంటుంది. అలాగే దీనిపై గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉండడంతో అత్యంత రక్షణగా ఉండే అవకాశం ఉంది. చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ బలమైన రక్షణను ఇస్తుంది. రోజువారి వినియోగదారులకు ఇది మరింత భద్రతను ఇచ్చే అవకాశం ఉంటుంది.
సోనీ ఎక్స్పీరియా మొబైల్ లో అత్యంత వేగవంతమైన ప్రాససర్ ను అమర్చారు. దీంతో గేమింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, మెసేజ్ వంటి పనులు ఫాస్ట్ గా చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే ఇందులో 16 జిబి ర్యామ్, 512జీబి స్టోరేజ్ ఉండడంతో మల్టీ టాస్కింగ్ యూస్ చేసేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఇందులో ఫోటోలు, వీడియోలు పుష్కలంగా స్టోర్ చేసుకోవడంతోపాటు కావలసిన యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ లో మెరుగైన కెమెరాలు అమర్చారు. అలాగే ఇందులో E5 2300 mAh బ్యాటరీ ఉండనుంది. ఇది రోజంతా వినియోగించినా కూడా డౌన్ టైం తక్కువగా ఉంటుంది. అలాగే ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండడంతో తక్కువ టైంలోనే ఎక్కువ ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉంది.
ఇక ఈ మొబైల్ 5G కనెక్టివిటీ విషయంలో ఏమాత్రం తగ్గేదిలే అన్నట్లు ఉంది. ఎందుకంటే వైఫై 7 ఆప్షన్ ఇందులో ఉండడంతో నెట్వర్క్ స్పీడులో ముందుంటుంది. ఫ్రంటు ఫేసింగ్ స్టీరియో స్పీకర్లు, అత్యధికంగా resolution ఇచ్చే విధంగా వీడియోలు, త3.5 mm హెడ్ ఫోన్ జాక్ ను అందిస్తూ సంగీత ప్రియులను ఆకర్షిస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన సాఫ్ట్వేర్లను అప్డేట్ చేసి దీనిని మార్కెట్లోకి తీసుకువచ్చారు.