POCO M8 Mobile: నేటి కాలంలో చాలామంది మొబైల్స్ కొనే ముందు కెమెరా పని తీరును ప్రధానంగా చూస్తున్నారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీతో పాటు సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేయడానికి కెమెరా అద్భుతంగా ఉండాలని అనుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కంపెనీలు మొబైల్లో కెమెరా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా POCO కంపెనీకి చెందిన ఓ ఫోన్ అందరిని అలరిస్తోంది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన M8 పేరుతో ఉన్న ఈ మొబైల్ ఫీచర్స్ తో పాటు.. బ్యాటరీ కూడా మెరుగ్గా ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చెబుతున్నారు. మరి వీటి వివరాలు కి వెళ్తే.
POCO M8 మొబైల్ ముఖ్యంగా 7s జెన్ 4 చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 హైపర్ 2.0 సాఫ్ట్వేర్ ను కలిగి ఉంది. దీని డిస్ప్లే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ మొబైల్లో 6.83 అంగుళాల 1.5 కేక్ క్వాడ్ AMOLED డిస్ప్లే ను కలిగే ఉంది. ఇది 120 Hz రిఫ్రిష్ రేటుతో పనిచేస్తుంది. అలాగే ఈ మొబైల్ చుట్టూ గొరిల్లా గ్లాస్ 2 విక్టోస్ కలిగి ఉండడంతో దీనికి అత్యంత రక్షణగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
పోకో కొత్త మొబైల్ లో కెమెరాను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది 50 MP మెయిన్ కెమెరాతో పనిచేస్తుంది.8 MP అల్ట్రా వైడ్ లెన్స్ తో ఉన్న ఇది సెల్ఫీ కావాలనుకునే వారికి 32 MP కెమెరా సపోర్ట్ చేస్తుంది. అలాగే పగలు, రాత్రి అని తేడా లేకుండా కావలసిన ఫోటోగ్రఫీ అని అందిస్తూ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి మద్దతుగా ఉంటుంది. ఈ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండడంతో నాణ్యమైన ఫోటోలను తీసుకోవచ్చు.
ఈ మొబైల్ లో బ్యాటరీ కూడా స్పెషల్ ఏ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 6500mAh బ్యాటరీ చేర్చారు. ఇది 100 వాట్ ఫాస్టెస్ట్ చార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. దీంతో రోజంతా వినియోగించే వారితోపాటు గేమింగ్ కోరుకునే వారికి చార్జింగ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే నిమిషాల్లోనే 100% చార్జింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మొబైల్ ఫాస్టెస్ట్ గా మువ్ కావడానికి ఇందులో అద్భుతమైన ప్రాసెసర్ ను చేర్చారు. ఇక ఇందులో బ్లూటూత్ 5.4, 7.9 ఎంఎం థిక్నెస్ తో పాటు 207 గ్రాముల బరువు ఉండడంతో చేతిలో పట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది.
త్వరలో మార్కెట్లోకి రాబోతున్న POCO M8 అందుబాటు ధరలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా రూ. 20000 లోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు.