Sony Xperia 1 VIII price: ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ SONY నుంచి ఆకర్షణీయమైన మొబైల్స్ అందుబాటులోకి వస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా సోనీ xperia 1VIII అనే మొబైల్ త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే దీనికి సంబంధించిన డిజైన్ తో పాటు ఫీచర్లు లీక్ చేశారు. లగ్జరీ ఫీచర్లను కలిగి ఉన్న ఈ మొబైల్ డిజైన్ ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది. మూవీస్ చూసేవారితో పాటు గేమింగ్ కోసం దీనిని కొనుగోలు చేయవచ్చని కొందరు మొబైల్ రంగ నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఈ మొబైల్ లో నాణ్యమైన కెమెరాను కూడా అమర్చారు. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాలు కి వెళ్తే..
సోనీ కంపెనీ నుంచి త్వరలో రాబోయే ఎక్స్పీరియా 1VIII మొబైల్ మూడు రంగుల్లో అందుబాటులోకి రానుంది. వీటిలో ఒకటి బ్లాక్ ఉండగా మరొకటి గ్రీన్, ఇంకొకటి ఉదా.. ఈ రంగులు ఇప్పటివరకు ఏ మొబైల్స్ లో చూడలేదు. ఇందులో 6.50 అంగుళాల డిస్ప్లే ను చూడవచ్చు. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. దీనిపై కార్మింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో ఉంటుంది. అలాగే ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ప్రాసెసర్ ఉండనుంది. వీటితోపాటు 12gb రామ్, 256 జీబీ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
ప్రస్తుత కాలంలో ప్రతి మొబైల్ లో కెమెరా గురించి ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. ఇందుకు అనుగుణంగా కొత్తగా వచ్చే సోనీ ఎక్స్పీరియా మొబైల్ లో 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ను చూడొచ్చు. అలాగే 12 ఎంపీ అల్ట్రా వైన్ పనిచేస్తుంది. 48 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా కూడా పనిచేయనుంది. దీంతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారు దీనిని ఉపయోగించుకోవచ్చు. ఈ మొబైల్ లో 5000 mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. రోజువారి వినియోగదారులతో పాటు బిజీగా ఉండేవారు ఈ బ్యాటరీని ఉపయోగించి చార్జర్ ను వాడుకోవచ్చు.
వీటితోపాటు ఐపీ 66, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ సెట్ ఉండనుంది. అలాగే డస్ట్ రిసిస్టెన్స్, వైర్లెస్ చార్జింగ్ కూడా ఉన్నాయి. భారతదేశంలో దీని ధర రూ.1,49,990 తో విక్రయించే అవకాశం ఉంది. ఈనెల మే లేదా జూన్ నెలలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.