Sonu Sood Wife Accident Car Safety
Sonu Sood : బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కరోనా సమయంలో ఆయన ఎంతో మందిని ఆదుకున్నారు. ఇటీవల భార్య సోనాలి సూద్, కుటుంబ సభ్యులు నాగ్‌పూర్ హైవేపై ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో సోనాలి సూద్ ప్రయాణిస్తున్న ఎంజీ విండ్‌సర్ కారు నుజ్జునుజ్జయ్యింది. అయితే, కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు సకాలంలో తెరుచుకోవడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ కారు మాత్రం బాగా దెబ్బతింది.
Also Read : మైలేజీలో మార్కెట్లో దీనికి సాటిలేదు.. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 1100కి.మీ
సోమవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సోనాలి సూద్ ఎంజీవిండ్‌సర్ కారులో ప్రయాణిస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఒక ట్రక్కు ఆ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం నాగ్‌పూర్ హైవే మీద జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో సోనాలి సూద్, ఆమె సోదరి, మేనల్లుడు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అందరినీ నాగ్‌పూర్‌లోని మాక్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే సోనూ సూద్ తన భార్య దగ్గరకు అంటే నాగ్ పూర్ చేరుకున్నారు. డాక్టర్లు అందించిన సమాచారం ప్రకారం సోనాలి సూద్, ఆమె మేనల్లుడిని 48 నుంచి 72 గంటల వరకు తమ పర్యవేక్షణలోనే ఉంచుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో సోనాలి సూద్ సోదరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం అందరూ ప్రమాదం నుంచి బయటపడి అందరూ క్షేమంగా ఉన్నారని సోనూ సూద్ తెలిపారు.
ఎంజీ విండ్‌సర్ ఒక ఎలక్ట్రిక్ SUV. ఇందులో అనేక లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరాతో వెనుక పార్కింగ్ సెన్సార్లు అలాగే TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. 38 kWh బ్యాటరీ ప్యాక్‌తో సింగిల్ ఛార్జ్‌పై 331 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. రియల్ టైంలో ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ కారులో గరిష్టంగా 250 కిలోమీటర్ల వరకు నడపవచ్చు.ఈ ప్రమాదం ఎంజీ విండ్‌సర్ కారు సేఫ్టీ ఫీచర్స్ వెలుగులోకి తెచ్చింది. లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ప్రయాణికుల ప్రాణాలను కాపాడడంలో ఎంత ముఖ్యమో నిరూపితం అయింది.
Also Read : ఈ సారి హైబ్రిడ్ వెర్షన్లో మార్కెట్లోకి అప్ గ్రేడెడ్ మారుతి చౌక కారు
#WATCH | Nagpur, Mahrashtra | Sonu Sood’s wife, Sonali Sood, and sister-in-law, Sunita, got injured in an accident on the flyover located on Wardha Road in Nagpur. The car in which Sonali Sood was sitting hit the truck from behind. The accident happened at 10.30 pm on Monday… pic.twitter.com/wJaBMHVPBx
— ANI (@ANI) March 25, 2025
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Sonu sood these are the safety features of the mg windsor car that saved sonu soods wife in an accident
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com