Maruti Alto : మారుతి సుజుకి ఇండియా గత రెండేళ్లలో తన అనేక ప్రసిద్ధ మోడళ్ల అప్‌గ్రేడ్ వెర్షన్‌లను రిలీజ్ చేసింది. ఇందులో స్విఫ్ట్ నుంచి డిజైర్ వరకు చాలా మోడల్స్ ఉన్నాయి. గ్రాండ్ విటారా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కూడా త్వరలో రాబోతుంది. ఈ సమయంలో మారుతి చౌకైన కార్లలో ఒకటైన ఆల్టో 10వ జనరేషన్ మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు అనేక మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కారు పెట్రోల్ హైబ్రిడ్ వెర్షన్‌లో రావచ్చు.
Also Read : టెస్టింగ్ సమయంలో కెమెరా కంట పడ్డ మారుతి నయా మోడల్స్ ఇవే
మారుతి మాతృ సంస్థ సుజుకి కార్పొరేషన్ జపాన్‌లో మారుతి ఆల్టో 9వ జనరేషన్ మోడల్‌ను ఇప్పటికే విక్రయిస్తోంది. కంపెనీ నుంచి పెట్రోల్ ఇంజిన్‌తో పాటు మైల్డ్ హైబ్రిడ్ మోటార్‌ను కూడా అందిస్తోంది. 10వ జనరేషన్ మారుతి ఆల్టో ఎలా ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
మారుతి ఆల్టో హైబ్రిడ్
మారుతి ఆల్టో 10వ జనరేషన్ గురించి ఇప్పటివరకు వచ్చిన వార్తల ప్రకారం.. కంపెనీ ఇందులో 657సీసీ 3-సిలిండర్ ఇంజిన్‌ను అందించనుంది. ఇది 49ps పవర్, 58 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు కస్టమర్లు కారు పెట్రోల్ ఇంజిన్‌తో 1.9 కిలోవాట్ల ఇంటిగ్రేటెడ్ మైల్డ్ హైబ్రిడ్ కిట్ పొందుతుంది. ఇలా జరిగితే మారుతి ఆల్టో మైలేజ్‌ను మరింత మెరుగుపరచడానికి ఇది పని చేస్తుంది.
మారుతి సుజుకి ఆల్టో 10వ జనరేషన్ మోడల్ మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 30 కి.మీ కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుంది. మారుతి ఆల్టో 9వ జనరేషన్ మోడల్‌ను కంపెనీ జపాన్‌లో విక్రయిస్తోంది. ఇది మైల్డ్ హైబ్రిడ్‌తో లీటరుకు 27.7 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ విధంగా మైలేజ్ పెరగడం వల్ల సామాన్యుడికి చాలా డబ్బుల ఆదా అవుతుంది.
కారు మైలేజీని పెంచడానికి, కంపెనీ మారుతి ఆల్టో ఈ మోడల్ బరువును 100 కిలోలు తగ్గించబోతుంది. ఈ కారు ప్రారంభ మోడల్ బరువు 580కిలోలు ఉండవచ్చు. దీని బరువు ప్రస్తుతం 680 కిలోలు. లేటెస్ట్ మారుతి ఆల్టో బరువు 680 కిలోగ్రాముల నుంచి 760 కిలోగ్రాముల మధ్య ఉంది. ఆల్టో బరువును తగ్గించడానికి అల్ట్రా హై అడ్వాన్స్‌డ్ స్టీల్‌ను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ చెబుతుంది.
Also Read : కొత్త ఎస్యూవీ కొనాలని చూస్తున్నారా..అయితే త్వరలో రాబోతున్న ఫ్యామిలీ కార్లు ఇవే