2020 సంవత్సరంలో కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గిన సంగతి తెలిసిందే. కార్ల అమ్మకాలు తగ్గడం అదే సమయంలో ఖర్చులు పెరగడంతో ఈ ఏడాది కార్ల కంపెనీలు రేట్లను గణనీయంగా పెంచాయి. అయితే తాజాగా ఒక కంపెనీ కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు భారీ షాక్ ఇచ్చింది. కార్ల ధరలను ఆ కంపెనీ మళ్లీ భారీగా పెంచింది. ఫలితంగా కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వాళ్లు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు అలర్ట్.. పేమెంట్స్ చేయకూడని సమయమిదే..?
దేశీ ప్రముఖ కార్ల తయారీ కంపెనీలలో ఒకటైన టాటా మోటార్స్ కొత్త కారును కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు షాక్ ఇచ్చింది. ఉత్పత్తి వ్యయాలు, ముడి పదార్థాల ధరలు భారీగా పెరగడంతో వాహన ధరలను పెంచుతున్నామని కీలక ప్రకటన చేసింది. ఫలితంగా కారును కొనుగోలు చేయాలనుకునే వారికి కొత్త కారు కొనుగోలు కోసం గతంతో పోలిస్తే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. పాన్ కార్డు లింక్ చేయకపోతే నష్టపోయినట్లే..?
స్టీల్, కండక్టర్స్, ఇతర లోహాల ధరలు భారీగా పెరగడంతో ధరలు పెంచుతున్నట్టు కంపెనీ నుంచి ప్రకటన వెలువడింది. కంపెనీ కార్ల ధరలను ఏకంగా 26 వేల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి 21 తర్వాత కార్లు బుక్ చేసుకున్న వాళ్లకు రేట్ల పెంపు వర్తించనుంది. కారు వేరియంట్ ప్రాతిపదిక ఆధారంగా కార్ల ధరలు పెరుగుతున్నాయి. జనవరి 21వ తేదీ లోపు కార్లు బుకింగ్ చేసుకున్న వాళ్లకు మాత్రం ఎలాంటి భారం పడదు.
మరిన్ని వార్తల కోసం: వ్యాపారము
దేశీయ దిగ్గజ కార్ల కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా కూడా ఇప్పటికే కార్ల ధరలను ఇప్పటికే పెంచినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలు కార్ల ధరలను పెంచగా ఇతర కార్ల కంపెనీలు కూడా ధరలు పెంచే అవకాశాలు ఐతే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వాళ్లు వీలైనంత త్వరగా కారును కొనుగోలు చేస్తే మంచిది.