
దాదాపు రెండు దశాబ్దాల నుంచి తెలుగులో వందల సంఖ్యలో పాటలు పాడుతూ సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు సునీత. ఈ ఏడాది జనవరి 9వ తేదీన డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనిని సునీత వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు. పెళ్లి తరువాత ఇంటర్వ్యూలు ఇస్తున్న సునీత ఆ ఇంటర్వ్యూల్లో కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. సింగర్ సునీతలో టాలీవుడ్ హీరోయిన్ కు కావాల్సిన లక్షణాలు పుష్కలంగా ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: రొమాంటిక్ సాంగ్ లో ‘బన్నీ – రష్మిక’ !
అయితే సునీత హీరోయిన్ గా మాత్రం నటించలేదు. హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా సునీత మాత్రం ఆ ఆఫర్లను రిజెక్ట్ చేశారని సమాచారం. తన గాత్రంతో కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న సునీతకు ఒక ఇంటర్వ్యూలో కెరీర్ మొదట్లో హీరోయిన్ ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేశారని ఇప్పుడు సినిమాలో ఛాన్సులు ఇస్తే చేస్తారా…? అనే ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు సునీత స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: వామ్మో.. సాయితేజ్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..?
తనకు ఇప్పుడంతా బాగానే ఉందని.. ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న సమయంలో ఆ జీవితాన్ని మార్చడం ఎందుకని సునీత అభిప్రాయపడ్డారు. పరోక్షంగా తనకు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని సునీత వెల్లడించారు. అయితే సునీత అభిమానులు మాత్రం సునీత సినిమాల్లో నటించకపోవడానికి ఏదైనా బలమైన కారణం ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. 27 సంవత్సరాల క్రితం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన గులాబీ సినిమా ద్వారా సింగర్ గా సునీత కెరీర్ ను మొదలుపెట్టారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సునీతకు హీరోయిన్ రోల్ ఆఫర్ చేశారని కానీ ఆమె మాత్రం అంగీకరించలేదని తెలుస్తోంది. మరో డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి కూడా సునీతకు హీరోయిన్ రోల్ ఆఫర్ చేశారని సమాచారం.