ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసైనికుడు వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతల ఒత్తిడులతోనే అతడు అసువులు బాసాడని జనసేన అధినేత పవన్ ఆరోపించాడు. తాజాగా ఈరోజు వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పరామర్శించాడు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
Also Read: పవనన్న ఫ్యాన్స్.. జగనన్నకు జై కొట్టారు..
జనసైనికుడి చావుకు కారణమైన గిద్దలూరు ఎమ్మెల్యే ను అథ: పాతాళానికి తొక్కేస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మీ ఎమ్మెల్యే ఇంత చేసినా ఎందుకు చర్య తీసుకోలేదని.. పేపర్లుమీడియాలో ఎందుకు చూపించడం లేదని జగన్ ను పవన్ ప్రశ్నించారు. దమ్ముంటే ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలని.. తాను ఎస్పీని కలిసి దీనిపై ఫిర్యాదు చేస్తానని పవన్ అన్నారు. న్యాయం జరగకపోతే బాధిత కుటుంబంతో సహా బైటాయిస్తామని తెలిపారు.
151మంది ఎమ్మెల్యేలను ఇస్తే రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచకం సృష్టిస్తున్నాడని.. ప్రశ్నించిన ప్రజలను, జర్నలిస్టులను కూడా వదలడం లేదని పవన్ నిప్పులు చెరిగారు.
Also Read: బ్రేకింగ్: ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నిమ్మగడ్డ
ఒక తండ్రిని బిడ్డకు దూరం చేసిన ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని.. ఆ బిడ్డకు , కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని పవన్ కళ్యాన్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం చేశారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని.. పిల్లలను జనసేన తరుఫున చదివిస్తానని పవన్ హామీ ఇచ్చారు. సీఎం జగన్ ను, ఎమ్మెల్యే రాంబాబుపై నిప్పులు కురిపించారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్