https://oktelugu.com/

బంగారం ప్రియులకు షాక్.. రూ.80 వేలకు చేరనున్న బంగారం ధర?

మన దేశంలోని ప్రజలు బంగారంను ఎక్కువగా ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయలకు అటూఇటుగా ఉంది. అయితే రాబోయే రోజుల్లో బంగారం ధర భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. గ్యాస్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో బంగారం ధర కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కెనడియన్ మైనింగ్ లో దిగ్గజాలుగా పేరును సొంతం చేసుకున్న డేవిడ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 25, 2021 / 09:51 AM IST
    Follow us on

    మన దేశంలోని ప్రజలు బంగారంను ఎక్కువగా ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయలకు అటూఇటుగా ఉంది. అయితే రాబోయే రోజుల్లో బంగారం ధర భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. గ్యాస్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో బంగారం ధర కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

    కెనడియన్ మైనింగ్ లో దిగ్గజాలుగా పేరును సొంతం చేసుకున్న డేవిడ్ గ్యారోఫెలో, రాబ్ మెక్విన్ అనే వ్యక్తులు బంగారం ధర భారీగా పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ లో సైతం బంగారం ధర భారీగా పెరిగే ఛాన్స్ అయితే ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధర 1800 డాలర్లుగా ఉండగా రాబోయే రోజుల్లో బంగారం ధర 3,000 డాలర్ల మార్కును దాటే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.

    పెరుగుతున్న బంగారం ధరల వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు టెన్షన్ పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 230 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 48,830 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా పెరుగుతుండటం గమనార్హం.

    22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 210 రూపాయలు పెరగడంతో 44,760 రూపాయలకు చేరింది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో బంగారం త్వరగా కొనుగోలు చేస్తే మంచిదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.