ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వినియోగదారులు అప్రమత్తమవుతున్నా మోసగాళ్లు కొత్తగా మోసాలు చేస్తూ చదువుకున్న వాళ్ల ఖాతాల్లో సైతం నగదును మాయం చేస్తున్నారు. తాజాగా అమెజాన్ కస్టమర్లను అప్రమత్తం చేసింది. అమెజాన్ పేరు చెప్పి ఎవరైనా అనుమానాస్పద కాల్స్ చేస్తే అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. లాగిన్ అకౌంట్ వివరాలను ఇతరులకు చెప్పవద్దని సూచించింది.
Also Read: కస్టమర్లకు ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు..?
కొందరు సైబర్ మోసగాళ్లు అమెజాన్ ఆర్డర్స్ పేరు చెప్పి అనుమానిత కార్యకలాపాలు, మోసాలకు పాల్పడుతున్నారని.. స్కామర్లు తిరిగి మరో నంబర్ కు కాల్ చేయాలని ఏదైనా ఎంటర్ చేయాలని చెబుతున్నారని.. అలాంటి మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అమెజాన్ సూచించింది. రోజూ లక్షల సంఖ్యలో అమెజాన్ డెలివరిలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి మోసాలకు ఆస్కారం ఉన్నట్టు అమెజాన్ ప్రకటించింది.
Also Read: టీవీ, ఫ్రిజ్ కొనాలనుకునే వాళ్లకు షాకింగ్ న్యూస్..?
అమెజాన్ ప్రతినిధులు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వివరాలు అడగరని అలా వివరాలు అడిగితే నకిలీ కాల్స్ అని గుర్తించాలని అమెజాన్ తెలిపింది. వివరాలను చెబితే ఖాతాలో నగదు మాయమయ్యే అవకాశాలతో ఉండటంతో పాటు అమెజాన్ అకౌంట్ హ్యాక్ అవుతుందని అపరిచిత నంబర్ల నుంచి అమెజాన్ పేర్లతో కాల్స్ వస్తే ఎలాంటి నంబర్స్ ను ప్రెస్ చేయవద్దని అమెజాన్ సూచనలు చేసింది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అమెజాన్ నుంచి కాల్ వస్తే ఒకసారి నంబర్ ను క్రాస్ చెక్ చేసుకోవాలని ఇతర దేశాల్లో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొంది. స్పామ్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ సూచించింది. ఆపిల్ సంస్థ సైతం వినియోగదారులకు ఇలాంటి హెచ్చరికలను జారీ చేసింది.