https://oktelugu.com/

ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే..?

కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రతి సంవత్సరం మే నెల నుంచి అక్టోబర్ సమయంలో నిర్వహించే పోటీ పరీక్షలన్నీ ఈ సంవత్సరం వాయిదా పడ్డాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆలస్యంగా ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలను నిర్వహిస్తోంది. 35,208 ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ చాలా నెలల క్రితమే విడుదల కాగా ఏకంగా 1,26,30,885 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సౌత్‌ వెస్ట్ర‌న్ రైల్వేలో ఉద్యోగాలు..? సాధారణంగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 9, 2020 / 06:00 AM IST
    Follow us on


    కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రతి సంవత్సరం మే నెల నుంచి అక్టోబర్ సమయంలో నిర్వహించే పోటీ పరీక్షలన్నీ ఈ సంవత్సరం వాయిదా పడ్డాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆలస్యంగా ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలను నిర్వహిస్తోంది. 35,208 ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ చాలా నెలల క్రితమే విడుదల కాగా ఏకంగా 1,26,30,885 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

    Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సౌత్‌ వెస్ట్ర‌న్ రైల్వేలో ఉద్యోగాలు..?

    సాధారణంగా దరఖాస్తు చేసుకునే వారితో పోల్చి చూస్తే ఈ సంవత్సరం ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్న నేపథ్యంలో ఆర్‌ఆర్‌బీ ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు మార్చి నెల చివరి వారం వరకు జరుగుతాయని వెల్లడించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్షకు పదిరోజుల ముందు అడ్మిట్ కార్డులు అందుతాయని ఆర్‌ఆర్‌బీ తెలిపింది.

    Also Read: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 85 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

    http://www.rrbcdg.gov.in/ వెబ్ సైట్ ద్వారా పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సబ్జెక్ట్ పై పూర్తి అవగాహన ఉన్నవాళ్లే సులభంగా ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మొదట్లో తక్కువ వేతనం లభించినా అనుభవం పెరిగే కొద్దీ వేతనం పెరుగుతుంది.

    మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

    ఆర్‌ఆర్‌బీ ప్రకటించిన ఇతర ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు సైతం ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఉద్యోగ ఖాళీలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.