కేంద్ర వైద్యఆరోగ్య శాఖ దేశంలోని ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారత్ బయోటెక్, సీరమ్ సంస్థలు ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు వెల్లడించింది. కేంద్ర వైద్యఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ పీఎం మోదీ కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో చర్చలు జరుపుతున్నారని అతి త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. కొన్ని వారాల్లో పలు వ్యాక్సిన్లకు లైసెన్స్ ఇస్తామని ఆ తరువాత వ్యాక్సిన్ ఇస్తామని వెల్లడించారు.
Also Read: కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. కోలుకున్నా ఆ సమస్యలు..?
చాలామంది ప్రజలు కరోనా వ్యాక్సినేషన్ కేవలం కేంద్రం, రాష్ట్రాల బాధ్యత అని అనుకుంటారని కానీ వ్యాక్సిన్ పంపిణీలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని తెలిపారు. తెలుస్తున్న సమాచారం మేరకు ప్రజలకు మరో రెండు వారాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత మొదట మూడు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది.
దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్యలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 శాతంగా ఉండగా గడిచిన 24 గంటల్లో అత్యల్పంగా కరోనా కేసులు నమోదయ్యాయి. అధికారులు కరోనా వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు ఇస్తామని.. అయితే వ్యాక్సిన్లను అన్ని విధాలా పరిశీలించి మాత్రమే అనుమతులు ఇవ్వగలమని వెల్లడించారు. కేంద్రం వ్యాక్సిన్ ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.
Also Read: 24 గంటల్లో కరోనా వైరస్ కు చెక్.. వెలుగులోకి కొత్త ఔషధం..?
దేశంలో ఇప్పటివరకు 97 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా లక్షా 40 వేల మంది కరోనాకు బలయ్యారు. బ్రిటన్ లో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్లలో ఒకటైన ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతులు లభించాయి. తాజా వార్తల నేపథ్యంలో ప్రజలకు అతి త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం