Earn Money From Home: మనలో చాలామంది ఇంటినుంచే సులభంగా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు. అలాంటి వాళ్లు ఏటీఎం ఫ్రాంఛైజ్ ద్వారా సులభంగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఏటీఎం ఫ్రాంఛైజ్ కావాలంటే 50 నుంచి 80 చదరపు అడుగుల స్పేస్ ఉండటంతో పాటు సమీపంలో మరో ఏటీఎం ఉండకూడదు. కాంక్రీట్ రూఫ్ తో ఏటీఎంను ఏర్పాటు చేయడంతో పాటు రోజుకు వందల సంఖ్యలో లావాదేవీలు జరగాలి.
ఎవరైతే ఏటీఎం ఫ్రాంఛైజీని తీసుకుంటారో వాళ్లకు బ్యాంకుల తరపున కొన్ని కంపెనీలు ఏటీఎంలను ఏర్పాటు చేస్తాయి. ఏటీఎంకు 1 కేడబ్ల్యూ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తో పాటు 24 గంటల పాటు పవర్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంఛైజ్ కు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డులను ఐడీ ఫ్రూఫ్ గా ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రాంఛైజ్ తీసుకునే వాళ్లు అవసరమైన వివరాలను అందించాల్సి ఉంటుంది.
Also Read: ఎల్ఐసీ పాలసీదారులకు ఫ్రీగా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలంటే?
ముత్తూట్ ఏటీఎం, ఇండియా వన్ ఏటీఎం, టాటా ఇండిక్యాష్ ఏటీఎంలలో ఒకదానిని ఏర్పాటు చేసుకుని సులభంగా డబ్బు సంపాదించవచ్చు. సెక్యూరిటీ డిపాజిట్ కింద 2 లక్షల రూపాయలు, మూలధన క్యాపిటల్ కింద 3 లక్షల రూపాయలు చెల్లించి ఏటీఎం ఫ్రాంఛైజీ తీసుకోవచ్చు. తక్కువ సమయంలోనే పెట్టుబడికి రెట్టింపు లాభాలను పొందవచ్చు. ప్రతిరోజూ 400 లావాదేవీలు జరిగితే సులభంగా నెలకు 60,000 రూపాయలు సంపాదించవచ్చు.
కంపెనీల వెబ్ సైట్లలో లాగిన్ కావడం ద్వారా ఏటీఎం ఫ్రాంఛైజ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఏటీఎం ఫ్రాంఛైజ్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.
Also Read: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 14 ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?