Shavukaru Movie: తెలుగు సినీ ప్రపంచంలో ‘షావుకారు’ సినిమా గొప్ప క్లాసిక్ సినిమాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. విజయా వారి నుండి వచ్చిన ఈ అద్భుతమైన సినిమా వెనుక అప్పట్లో ఒక ఆసక్తికరమైన విషయం జరిగిందట. మొదట ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరావును హీరోగా పెట్టాలని ప్లాన్ చేశారు ఎల్.వి.ప్రసాద్. కానీ.. చక్రపాణికి అక్కినేనితో ఈ సినిమా చేయడం ఇష్టం లేదు.

అందుకే, ఎల్.వి.ప్రసాద్ షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకున్నప్పుడు, చక్రపాణి పట్టుబట్టి షూటింగ్ జరగకుండా ఏదో రకంగా అడ్డు పడుతూ ఉండేవారు. అలా రెండు సార్లు జరిగింది. మరో నిర్మాత నాగిరెడ్డి మాత్రం షూటింగ్ గురించి ఎల్.వి.ప్రసాద్ ను అడుగుతూ ఉండేవారు. దాంతో ఓ రోజు ఎల్.వి.ప్రసాద్ సీరియస్ అవుతూ.. ‘నాగిరెడ్డి గారు షూటింగ్ ఆలస్యం గురించి ముందు మీరు మీ చక్రపాణి గారిని అడగండి’ అంటూ లేచి వెళ్లిపోయారు. నాగిరెడ్డికి ఏం జరుగుతుందో అర్థం కాక, చక్రపాణి వైపు చూశారు.
Also Read: కలకలం: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వాహనంపై టీఆర్ఎస్ దాడి..
చక్రపాణి నవ్వి.. ‘ప్రతి కథకు ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మకు ఒక అభిరుచి ఉంటుంది. అందుకే, ఆ అభిరుచిని బట్టి హీరోను ఎన్నుకోవాలి’ అని చెప్పుకుంటూ పోయారు. నాగిరెడ్డి చిరాకు పడుతూ.. ‘అది కాదు చక్రపాణి, ఇంతకీ అసలు విషయం చెప్పు’. ‘ఈ సినిమాకు హీరోను మార్చాలి. ‘అదేంటి ? అక్కినేనికి ఏమైంది ? ఫామ్ లో ఉన్న హీరో కదా. చక్రపాణి పైకి లేచి.. ‘ఈ కథకు ఫామ్ లో ఉన్న హీరో కంటే.. కథనే ఫామ్ లోకి తెచ్చే హీరో కావాలి’ అని నాగిరెడ్డి వైపు చూశాడు.

‘అంటే రామారావును పెట్టుకుందామా ? అని నాగిరెడ్డి డౌట్ గా చూశాడు. చక్రపాణి అవును అన్నట్టు తలూపాడు. కట్ చేస్తే.. షావుకారు జానకి – నందమూరి తారక రామారావు కలయికలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. శరవేగంగా పూర్తి చేసుకుని 1950న ఏప్రిల్ 7న విదుదలైన ఈ సినిమా దారుణంగా పరాజయం పాలైంది. ఎందుకో అప్పట్లో ఈ క్లాసిక్ సినిమా కథ కూడా జనానికి పెద్దగా కనెక్ట్ కాలేదు. కానీ గొప్ప పేరు వచ్చింది.
అయితే సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు గానీ, ఎన్టీఆర్ ను మాత్రం హీరోగా నిలబెట్టింది. ఇక ఈ చిత్రకథలో మరో గమ్మత్తు ఏమిటంటే.. కథానాయకుడి పాత్ర విచిత్రంగా ఉంటుంది. ఎన్టీఆర్ కూడా చాలా బాగా నటించారు. ఇక సినిమా చూసిన ఏఎన్నార్ చక్రపాణి దగ్గర వచ్చి.. నిజమే అండి, ఫామ్ లో ఉన్న ఏఎన్నార్ కంటే, కథనే ఫామ్ లోకి తెచ్చే ఎన్టీఆర్ మిన్న’ అని అక్కినేని నవ్వారట’.
Also Read: హిందీలో రిలీజ్ అవుతున్న రవితేజ క్రేజీ మూవీ
[…] Akhanda: నటసింహం బాలయ్య ‘అఖండ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. అందుకే ‘అఖండ’ క్రేజ్ బాలీవుడ్ కు కూడా పాకింది. బాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పైగా ఈ సినిమాను రీమేక్ చేసేందుకు బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ పోటీ పడుతున్నారని తెలుస్తోంది. నిజానికి ఇటు అక్షయ్ కుమార్ కి అటు అజయ్ దేవగణ్ కి ఇద్దరికీ అఖండ క్యారెక్టర్ బాగా సూట్ అవుతుంది. […]