UP Minister Swati Singh: ఉత్తరప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పార్టీల్లో చేరికలు పెరుగుతున్నాయి. ఒక పార్టీనుంచి మరో పార్టీకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మహిళా మంత్రి తన భర్త గురించి సామాజిక మాధ్యమంలో ఆసక్తికర పోస్టు పెట్టి వైరల్ గా మారుతోంది. దీంతో రాష్ర్టవ్యాప్తంగా సంచలనంగా మారింది. త్వరలో ఎన్నికలు జరిగే సందర్భంలో బీజేపీకి చెందిన మంత్రి స్వాతి సింగ్ తన మనసులోని మాటను సోషల్ మీడియాలో పెట్టింది.

సదరు మంత్రి ఓ వ్యక్తితో మాట్లాడుతూ తన భర్త తనను కొడతాడని చెబుతుండటం విశేషం. భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే. కానీ అంత మాత్రాన ఇలా మీడియాకు ఎక్కడం ఏమంత సమంజసం కాదనే విషయం ఆమెకు తెలియదా అనే వాదనలు వస్తున్నాయి. స్వాతిసింగ్ విషయం కాస్త నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీకి మరో మచ్చ కానుందా అనే సందేహాలు వస్తున్నాయి.
Also Read: లైవ్‌లో జర్నలిస్టును బూతులు తిట్టిన అమెరికా అధ్యక్షుడు.. జోబైడెన్‌కు ఏమైంది?
యూపీలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న స్వాతిసింగ్ భర్త దయాశంకర్. ఆయన కూడా బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఈ తరుణంలో వారిపై సోషల్ మీడియాలో ఇలా రావడం ఆందోళన కలిగిస్తోంది. శారీరకంగా వేధించాడని చెబుతోంది. దీంతో యూపీలో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ విషయం ఎక్కడ చర్చించొద్దని కోరినా సాధ్యం కాలేదు.
భార్యాభర్తలన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు మామూలే. కానీ ఇలా సామాజిక మాధ్యమాలకు ఎక్కడం సముచితం కాదనే విషయం తెలిసినా ఎందుకో స్వాతి సింగ్ ఇలా చేసుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సంసారాన్ని రచ్చకీర్చడం ఎవరికి మంచిది కాదనే ఉద్దేశం తెలియదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికి రాజకీయకోణంలో చూస్తే ఎవరో సృష్టించారనే విషయం అర్థమవుతోంది.
Also Read: తగ్గేదేలే.. ఏడు భాషల్లో కొత్త మీడియాతో రవిప్రకాష్ రె‘ఢీ’