SBI Business Loan : అయితే బిజినెస్ చేయాలని అనుకుంటున్నా వాళ్లకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మంచి అవకాశం ఇచ్చింది. మీ వ్యాపారానికి పెట్టుబడిగా మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఐదు కోట్ల వరకు రుణం పొందే అవకాశం కల్పించింది. మీరు ఈ రుణం పొందడానికి బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరగాల్సిన అవసరం లేదు. కేవలం 15 నిమిషాలలో ఈ లోన్ డబ్బులు మీ ఖాతాలో వస్తాయి. ఎం ఎస్ ఎం ఈ సహజ లోన్ అనే పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త లోన్ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న, సూక్ష్మ మరియు మధ్య తరహా వ్యాపారాల కోసం ఈ ప్రత్యేక పథకం రూపొందించబడింది. మీకు ఇప్పటికే ఒక సొంత వ్యాపారం కలిగి ఉన్నా లేదా మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నా కూడా ఈ స్కీము మీకు బాగా సహాయపడుతుంది.
Also Read : జులై 1 నుంచి క్రెడిట్ కార్డులపై కొత్త చార్జీలు అమలు..
మీరు గరిష్టంగా ఐదు కోట్ల వరకు ఎంఎస్ఎంఈ సహజం ద్వారా లోన్ పొందవచ్చు. పూర్తిగా ఈ లోన్ ప్రాసెస్ డిజిటల్ విధానంలో జరుగుతుంది. దీనికోసం మీరు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ఇంటి దగ్గర నుంచే మీ ఫోన్లో YONO SBI యాప్ ఓపెన్ చేసుకొని ఈ లోన్ కు దరఖాస్తు చేసుకోవొచ్చు. కేవలం 15 నిమిషాలలో ఈ లోన్ అమౌంట్ మీ ఖాతాలో పడుతుంది. చాలామంది యువత ఈ మధ్యకాలంలో వ్యాపారం ప్రారంభించడానికి డబ్బు కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్లు డబ్బులు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులో వ్యాపారం కోసం రుణం పొందాలంటే గ్యారెంటీలు, డాక్యుమెంట్లు అలాగే కోలేటరల్ అనే పదాలతో చాలామంది భయపడి మధ్యలోనే వ్యాపారం చేయాలనే ఆలోచన మానుకుంటున్నారు.
అటువంటి వారందరికీ తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎం ఎస్ ఎం ఈ సహజ్ స్కీం కింద ఒక శుభవార్త తెలిపింది. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. తక్కువ డాక్యుమెంట్లు అలాగే తక్కువ సమయంతో ఈ స్కీంలో మీకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు కూడా ఉంటాయి. ఈ లోన్ పొందాలంటే మీ వ్యాపార సంస్థ జీఎస్టీ కింద నమోదు కలిగి ఉండాలి. మీ వ్యాపారానికి సంబంధించిన కరెంట్ ఖాతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉండాలి. మీరు స్వయంగా ఆ వ్యాపార యాజమాని అయినా కూడా సరిపోతుంది. దీనికి పెద్ద పెద్ద రిజిస్ట్రేషన్లు వంటివి అవసరం ఉండదు. జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యాపార సంస్థలు ఈ పథకం కింద ఒక లక్ష రూపాయలు తక్షణ లోను పొందవచ్చు. దీనికి ఎటువంటి భద్రత ఆస్తి కూడా అవసరం లేదు.