Credit Card Charges : హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ రెండు కూడా క్రెడిట్ కార్డు లావాదేవులపై తాజాగా నిబంధనలను సవరించడం జరిగింది. ఈ రెండు బ్యాంకులు ప్రవేశపెట్టిన కొత్త చార్జీలు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సంబంధిత బ్యాంకులు తమ కస్టమర్లకు నోటీసులు కూడా పంపడం జరిగింది. క్రెడిట్ కార్డు లావాదేవీలపై హెచ్డిఎఫ్సి బ్యాంకు కొత్త నిబంధనలను అమలు చేసింది. జులై 1వ తేదీ నుంచి గేమింగ్, వాలెట్ లోడింగ్, యుటిలిటీ వంటి చార్జీలపై కొత్త చార్జీలు అమలు చేస్తారు. నెలకు 10,000 కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే డ్రీం11, రమ్మీ కల్చర్, జంబ్లీ గేమ్స్ లేదా ఎం పి ఎల్ 20 ప్లాట్ ఫామ్ లలో 1% చార్జి విధిస్తారు.
Also Read : 2,402 ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఆహ్వానం.. నిరుద్యోగులు వెంటనే త్వరపడండి
గరిష్టంగా ఇవి రూ.4,999 గా ఉంటుందని అలాగే ఆన్లైన్లో చేసే గేమింగ్ లావాదేవీలపై ఎటువంటి రివార్డు పాయింట్లు కూడా లభించమని హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్పష్టంగా తెలిపింది. అలాగే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ను ఉపయోగించి మీరు పేటియం, ఫ్రీ ఛార్జ్, మోబిక్విక్ లేదా పోలావంటే ప్లాట్ ఫామ్ లలో పదివేల రూపాయల కంటే ఎక్కువగా వాలెట్ లోడింగ్ చేసినట్లయితే మీకు 1% చార్జీ విధిస్తారు. మీరు మొత్తం నెలలో చేసే వాలెట్ లోడింగ్ ఖర్చుకు ఈ చార్జీ వర్తిస్తుంది అని చెప్పొచ్చు. మీకు ఇందులో గరిష్టంగా రూ4,999 గా ఉంటుంది. అలాగే మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ను ఉపయోగించి నెలకు 50 వేల రూపాయలకు మించి యుటిలిటీ లావాదేవీలు చేసినట్లయితే మీకు 1 పర్సెంట్ ఛార్జి వర్తిస్తుంది. మొత్తం నెలలో ఉండే యుటిలిటీ ఖర్చులకు ఈ చార్జీ పడుతుంది. దీనికి కూడా మీకు రూ.4,999 గా ఉంటుంది.
అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఫ్యూయల్, రెంట్, ఎడ్యుకేషన్ వంటి క్యాటగిరీలకు సంబంధించి ఒక్క కేటగిరీకి గరిష్ట చార్జీని రూ.4,999 దాని నిర్ణయించడం జరిగింది. జులై 1 నుంచి జరిగే అన్ని లావాదేవీలకు కూడా ఈ కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. ఐసిఐసిఐ బ్యాంకు కూడా డిడి, పి ఓ, ఏటీఎం ఎంటర్ చేంజ్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ వంటి వాటిపై కొత్త నియమాలను సవరించింది. ప్రతి 1000 రూపాయలకు నగదు డిపాజిట్, చెక్కు, డిడి, పిఓ బదిలీ వంటి వాటిపై రెండు రూపాయలుగా చార్జీలను సవరించింది. ఈ చార్జీలు కనిష్టంగా రూ.50 రూపాయలు అలాగే గరిష్టంగా రూ.15000 ఉంటాయి.