Santosh Rural Postal Life Insurance Scheme: ప్రస్తుతం పోస్టాఫీస్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ లలో ఎన్నో బీమా స్కీములు కూడా ఉండగా ఈ స్కీమ్ లలో చేరడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. సంతోష్ పాలసీ పేరుతో పోస్టాఫీస్ ఒక స్కీమ్ ను అమలు చేస్తుండగా ఇది ఎండోమెంట్ ప్లాన్ కావడం గమనార్హం. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా బోనస్ తో పాటు బీమా మొత్తంపై మెచ్యురిటీ పొందే అవకాశం ఉంటుంది.
పోస్టల్ ఇన్సూరెన్స్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కాగా ఐఆర్డీఏతో ఏ సంబంధం లేకుండానే ఈ స్కీమ్ అమలు జరుగుతోంది. పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే నామినీ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, సెమీ ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకర్లు, న్యాయవాదులు, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌లు, ఛార్టెడ్ అకౌంటెంట్లు ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉంటుంది.
కనీసం 19 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి ఈ స్కీమ్ లో చేరే అవకాశం అయితే ఉంటుంది. గరిష్ట వయోపరిమితి 55 సంవత్సరాలు కాగా పాలసీ తీసుకునే సమయంలోనే ఏ వయస్సులో మెచ్యూరిటీ తీసుకోవాలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది రెగ్యులర్ ప్రీమియం పాలసీ కాగా పాలసీ అమలులో ఉన్న సంవత్సరాలకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
5 లక్షల రూపాయల బీమా మొత్తానికి నెలకు కేవలం 1332 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే 30 సంవత్సరాల తర్వాత 12,80,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.