https://oktelugu.com/

Moplah Rebellion 1921: 100 ఏళ్ల క్రితం మోప్లా పోరాటంపై ఎందుకింత వివాదం..?

Moplah Rebellion 1921: వంద సంవత్సరాల క్రితం జరిగిన మోప్లా పోరాటం ఇప్పుడు వివాదమైంది. ఓవైపు కేరళ ప్రభుత్వం ఆ ఉత్సవాలు జరుపుతానంటుంటే .. మరో వైపు ఇది చరిత్రలో అత్యంత దుర్ధినం అని బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలు ఈ మోప్లా పోరాటం ఏంటి? ఏం జరిగింది? ఎందుకింత వివాదాస్పదమైందనే దానిపై తెలుసుకుందాం.. మోప్లాలు అనే వారు అరబ్ నుంచి 9వ శతాబ్ధంలో కేరళకు వచ్చి స్థిరపడ్డ ముస్లింలు.. 16వ శతాబ్ధంలో పోర్చుగీసు వర్తకులు […]

Written By: , Updated On : August 25, 2021 / 12:58 PM IST
Follow us on

Moplah Rebellion 1921

Moplah Rebellion 1921: వంద సంవత్సరాల క్రితం జరిగిన మోప్లా పోరాటం ఇప్పుడు వివాదమైంది. ఓవైపు కేరళ ప్రభుత్వం ఆ ఉత్సవాలు జరుపుతానంటుంటే .. మరో వైపు ఇది చరిత్రలో అత్యంత దుర్ధినం అని బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలు ఈ మోప్లా పోరాటం ఏంటి? ఏం జరిగింది? ఎందుకింత వివాదాస్పదమైందనే దానిపై తెలుసుకుందాం..

మోప్లాలు అనే వారు అరబ్ నుంచి 9వ శతాబ్ధంలో కేరళకు వచ్చి స్థిరపడ్డ ముస్లింలు.. 16వ శతాబ్ధంలో పోర్చుగీసు వర్తకులు ఈ ‘మోప్లాలను’ అరబ్ నుంచి వచ్చి పట్టణాల్లో స్థిరపడ్డ వ్యాపారులు అని చెప్పుకొచ్చారు. 16వ శతాబ్దంలో స్థానికంగా ఉన్న హిందువులతో ఈ మోప్లాలకు మల్లపురం జిల్లాలో ఘర్షణలు మొదలయ్యాయి.

18వ శతాబ్ధంలో టిప్పు సుల్తాన్ రాకతో మోప్లాలు రెచ్చిపోయి కేరళలో హిందువుల ఆలయాలు, ఆస్తులపై దాడులకు పురిగొల్పారని చరిత్రలో చెబుతారు. టిప్పు సుల్తాన్ రాకతో మోప్లాలకు బలం చేకూరింది. ఆ తర్వాత దేశంలోకి బ్రిటీష్ వారి రాకతో హిందువులు వారి పంచన చేరి మోప్లాలకు వ్యతిరేకంగా సాగారు.  తదనంతర ఆధిప్యత పోరులో హిందూ-ముస్లిం ఘర్షణలు నాడూ కొనసాగాయి.

1920లో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో కేరళలోని మోప్లా ముస్లింలు దూరంగా ఉన్నారు. ఆది నుంచి భారత్ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా పనిచేసిన మోప్లా ముస్లింల ఉత్సవాలను కేరళ ప్రభుత్వం చేయడంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందుత్వవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటయోధులుగా మోప్లా ముస్లింలను గుర్తిస్తూ పెన్షన్ ఇస్తున్న కమ్యూనిస్టు కేరళ ప్రభుత్వంపై బీజేపీ మండిపడుతోంది. ఈ క్రమంలోనే కేరళలో ఈ వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది..

అసలు మోప్లా పోరాటం ఏంటి? కేరళలో జరిగిన హిందూ -ముస్లిం ఘర్షణలు, బ్రిటీష్ వారి రాక తర్వాత పరిణామాలపై స్పెషల్ ఫోకస్ వీడియో..

వంద సంవత్సరాల క్రితం జరిగిన మోప్లా పోరాటంపై ఎందుకింత వివాదం..? | Analysis on Moplah Rebellion 1921