Safety Cars : భారతదేశంలో కార్లు కొనే వినియోగదారులు ఫీచర్లతో పాటు సేఫ్టీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు చిన్న కార్ల కంటే పెద్ద, సురక్షితమైన కార్ల అమ్మకాలు పెరిగాయి. మీరు కూడా మీ కోసం సురక్షితమైన కారు కొనాలని చూస్తుంటే.. మీ బడ్జెట్ 15 లక్షల రూపాయల వరకే అయితే ఈ బడ్జెట్‌లో లభించే 5 బెస్ట్ కార్స్ గురించి ఈ వార్త కథనంలో తెలుసుకుందాం. ఈ కార్లలో 5 స్టార్ భద్రతా రేటింగ్‌తో పాటు అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
Also Read : మార్కెట్లో ఉన్న బెస్ట్ సేప్టీ కార్లు ఏవో తెలుసా? వీటి ధర ఎంతో తెలుసా?
టాటా పంచ్
గ్లోబల్ NCAP 5 స్టార్ భద్రతా రేటింగ్‌తో టాటా పంచ్ దేశంలోనే చౌకైన కారు. భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కారు టాటా పంచ్. ఈ కారుకు పెద్దల సేఫ్టీ కోసం 5 స్టార్స్, పిల్లల సేఫ్టీ కోసం 4 స్టార్స్ లభించాయి. న్యూఢిల్లీలో టాటా పంచ్ ధర రూ.6 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుంది. టాటా పంచ్ ప్యూర్ అత్యల్ప ధర కలిగిన మోడల్, టాటా పంచ్ క్రియేటివ్ ప్లస్ ఎస్ కామో AMT అత్యధిక ధర కలిగిన మోడల్, దీని ధర రూ. 10.32 లక్షలు.
టాటా నెక్సాన్
ఈ ధర పరిధిలో టాటా నెక్సాన్ రెండవ కారు. ఇది కంపెనీ అత్యధికంగా అమ్ముడవుతున్న కారు కూడా. నెక్సాన్ పెద్దల సేఫ్టీ కోసం 5-స్టార్ రేటింగ్, పిల్లల సేఫ్టీ కోసం 3-స్టార్ రేటింగ్ పొందింది. 8.09 లక్షల రూపాయల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమయ్యే నెక్సాన్ పెట్రోల్, డీజిల్, ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉంది.
హ్యుందాయ్ వెర్నా
హ్యుందాయ్ కార్ల సేఫ్టీ మీద దృష్టి పెట్టడం ప్రారంభించింది. హ్యుందాయ్ వెర్నా సేఫ్టీకి 5 స్టార్స్ పొందిన మొదటి కారు. హ్యుందాయ్ వెర్నా పెద్దలు , పిల్లల సేఫ్టీ కోసం 5 స్టార్స్ పొందింది. కొత్త హ్యుందాయ్ వెర్నా ధర 10.96 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. హ్యుందాయ్ వెర్నాలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS వంటి అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
మారుతి సుజుకి డిజైర్
మారుతి కూడా ఇప్పుడు కార్ల సేఫ్టీ పై దృష్టి పెడుతోంది. మారుతి సుజుకి డిజైర్ గ్లోబల్ NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన మొదటి కారు. ఇప్పుడు మారుతి ఈ కారు సేఫ్టీని ఇష్టపడే వారి ఆఫ్షన్ గా మారుతోంది. మారుతి సుజుకి డిజైర్ ఎక్స్-షోరూమ్ ధర 6.84 లక్షల రూపాయల నుండి 10.19 లక్షల రూపాయల వరకు ఉంది. LXI బేస్ మోడల్, VXI ప్లస్ AMT టాప్ మోడల్.
స్కోడా కుషాక్
స్కోడా కుషాక్ కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో లభించే ప్రీమియం SUV. కుషాక్ స్కోడా ఇండియా ఎంట్రీ-లెవల్ క్రాస్‌ఓవర్ మోడల్, ఇది దాని రిఫైన్‌మెంట్, బిల్డ్ క్వాలిటీ, పర్ఫామెన్స్ కు చాలా మంది ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా, ఈ కారు పెద్దలు, పిల్లల సేఫ్టీ కోసం 5 స్టార్స్ పొందింది. కుషాక్ ఎక్స్-షోరూమ్ ధర 10.99 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది.
Also Read : సేఫ్టీలో అత్యంత తక్కువ రేటింగ్ పొందిన కార్లు ఏవో తెలుసా?