https://oktelugu.com/

Best Safety Cars : మార్కెట్లో ఉన్న బెస్ట్ సేప్టీ కార్లు ఏవో తెలుసా? వీటి ధర ఎంతో తెలుసా?

మార్కెట్లో మైలేజ్, ఫీచర్స్ కాకుండా సేప్టీకి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే కార్లు చాలా వరకు ఉన్నాయి. సేప్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉంటే ధర అధికంగా ఉంటాయి. కానీ తక్కువ ధరలోనే బెస్ట్ సేప్టీ ఫీచర్స్ కారుగా గుర్తింపు పొందినవి కొన్ని ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళితే..

Written By:
  • Srinivas
  • , Updated On : January 1, 2025 / 06:04 PM IST

    Best Safety Cars

    Follow us on

    Best Safety Cars :  కొత్త కారు కొనే ముందు వినియోగదారులు రకరకాలుగా ఆలోచిస్తారు. కొందరు లో బడ్జెట్ లో కారు రావాలని కోరుకుంటారు. మరికొందరు ఫీచర్స్ బాగుండాలని అనుకుంటారు. ఇంకొందరు మంచి మైలేజ్ ఇవ్వాలని చూస్తారు. అయితే కారు ఎలా ఉన్నా సేప్టీగా ఉండాలని అనుకునేవారే ఎక్కువ. సేప్టీ కారు అయితే ఎక్కడికి వెళ్లినా.. ప్రమాదాలు కాకుండా ఉంటాయని చాలా మంది భావన. ఈ క్రమంలో సేప్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉండే కార్లు కొనాలని చూస్తారు. మార్కెట్లో మైలేజ్, ఫీచర్స్ కాకుండా సేప్టీకి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే కార్లు చాలా వరకు ఉన్నాయి. సేప్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉంటే ధర అధికంగా ఉంటాయి. కానీ తక్కువ ధరలోనే బెస్ట్ సేప్టీ ఫీచర్స్ కారుగా గుర్తింపు పొందినవి కొన్ని ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళితే..

    నేటి కాలంలో కాస్త బడ్జెట్ ఎక్కువ అయినా రక్షణ ఉండాలని అనుకునే కారు వినియోగదారులు ఎక్కువగానే ఉన్నారు. కారు విక్రయించే మందే క్రాష్ టెస్ట్ నిర్వహించి దీనికి సేప్టీ రేటింగ్ ఇస్తారు. అయితే ఇందులో ఉండే సేప్టీ ఫీచర్స్ ఆధారంగానే రేటింగ్ ఇస్తారు కొన్ని కార్లలో ఉండే సేప్టీ ఫీచర్స్ తో కారు మరింత భద్రత ఇస్తుంది. వీటిల మారుతికి చెందిన స్విప్ట్ కారు బెస్ట్ సేప్టీ ఫీచర్స్ కారుగా పేరు తెచ్చుకుంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ పనచిేస్తుంది. రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సార్ వంటివి ఆకర్షిస్తాయి. అయితే ఈ కారులో సేప్టీ ఫీచర్స్ ఉన్నప్పటికీ దీనిని రూ.6.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

    నిస్సాన్ కంపెనీకి చెందిన మాగ్నైట్ కారులో మంచి సేప్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో రక్షణ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా, సీట్ బెల్ట్ వార్నింగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాంటీ లాకింగ్ సిస్టమ్ ను ఇందులో అమర్చారు. ట్రాక్షన్ కంట్రోల్ హిల్ సిస్టమ్ తో పాటు రివర్స్ పార్కింగ్ కెమెరాను మాగ్నైట్ కారులో అమర్చారు. దీనిని రూ. 6 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

    దేశంలో హ్యుందాయ్ కార్లకు మంచి గుర్తింపు ఉంది. ఈ కంపెనీ నుంచి ఎక్కువగా ఎస్ యూవీ కార్లు మార్కెట్లోకి వస్తుంటాయి. అయితే కొన్ని కార్లు మంచి రక్షణ ఇస్తాయన్న పేరుంది. వీటిల ఎక్స్ టర్ ఒకటి. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాకింగ్ సిస్టమ్, డ్యూయెల్ డాష్ కామ్, 3 పాయింట్ సీట్ బెల్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే సీట్ బెల్ట్ అలర్ట్, హిల్ స్టార్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇదే కంపెనీకి చెందిన గ్రాండ్ ఐ 19 నియోస్ కారులో సేప్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ , యాంటీ లాకింగ్ సిస్టమ్, 3 పాయింట్ సీట్ బెల్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవే కాకుండా మార్కెట్లో మరిన్న కార్లు బెస్ట్ సేప్టీ కార్లుగా ఉన్నాయి.