https://oktelugu.com/

Safety Cars : సేఫ్టీలో అత్యంత తక్కువ రేటింగ్ పొందిన కార్లు ఏవో తెలుసా?

మారుతి కంపెనీ నుంచి రిలీజ్ అయినా S Presso రూ. 4.26 లక్షల నుంచి 6.11 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇది పెద్దలకు రక్షణ ఇవ్వడంలో 34 పాయింట్లకు 20.03 పాయింట్లు సాధించింది.

Written By:
  • NARESH
  • , Updated On : March 9, 2024 / 02:12 PM IST
    Follow us on

    Safety Cars : కారు ఎంత ఆకర్షించే డిజైన్ ఉన్నా.. లో బడ్జెట్ లో లభించినా.. కొంత మంది ఎంత వరకు రక్షణగా ఉంటుందనే విషయాన్ని గ్రహిస్తారు. కొంతమంది బాహుబలి లాంటి ఇంజిన్ ఉండి.. రేసు గుర్రంలా దూసుకుపోవాలని అనుకుంటారు. కానీ వీరికి వ్యతిరేకంగా భద్రతతో ఉండాలని కోరుకునేవారు కూడా ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కొన్ని కంపెనీలు భద్రతకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఉత్పత్తి చేస్తాయి. అయితే అమ్మకాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న మారుతి కంపెనీ కార్లు మాత్రం అత్యంత తక్కువ రేటింగ్ ను సాధించాయి. గ్లోబల్ National Car Assessment Progrome(NCAP) 2022 జూలై నుంచి కొత్త కార్లను టెస్ట్ చేసి రేటింగ్ ఇస్తోంది. నిబంధనల ప్రకారం కార్లు ఉత్పత్తి అయితే వాటికి రేటింగ్ ఇస్తోంది. NCAP మారుతి కంపెనీకి చెందిన కొన్ని కార్లకు అతి తక్కువ రేటింగ్ ఇచ్చింది. ఆ కార్లు ఏవో చూద్దాం..

    మారుతి కంపెనీ నుంచి ఎక్కువగా అమ్ముడు పోతున్న కార్లలో వ్యాగన్ ఆర్ ఒకటి. లో బడ్జెట్ లో అప్డేట్ ఫీచర్స్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. అయితే ఈ కారు సేప్టీలో తక్కువ పాయింట్లు సాధించింది. పెద్దల భద్రత విషయంలో ఈ కారు 34 పాయింట్లకు కేవలం 19.69 మాత్రమే సాధించింది. పిల్లల రక్షణ విషయంలో 49కి కేవలం 3.40 పాయింట్లు వచ్చాయి. ఈ కారు రూ.5.54 లక్షల నుంచి రూ.7.37 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

    మారుతి వ్యాగన్ ఆర్ తో పోటీ పడి అత్యధికంగా అమ్మకాలు సాగే కార్లలో స్విప్ట్ ఒకటి. ఇది రక్షణ విషయంలో కొంచెం మెరుగైన రేటు సాధించింది. పెద్దల విషయంలో 19.19 పాయింట్లు, పిల్లల రక్షణ విషయంలో 16.68 పాయింట్లు సాధించింది. ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.03 లక్షల వరకు ఉంది. ఆల్టో కే 10 భద్రత విషయంలో 2 స్టార్లను మాత్రమే సాధించింది. పెద్దల విషయంలో 34కి 21.67 పాయింట్లు పిల్లల రక్షణ విషయంలో 49కి 3.52 పాయింట్లు సాధించింది. ఈ కారు ఎక్స్ షోరూం వద్ద రూ.3.99 లక్షల నుంచి మొదలై రూ.5.96 వరకు విక్రయిస్తున్నారు.

    మారుతి కంపెనీ నుంచి రిలీజ్ అయినా S Presso రూ. 4.26 లక్షల నుంచి 6.11 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇది పెద్దలకు రక్షణ ఇవ్వడంలో 34 పాయింట్లకు 20.03 పాయింట్లు సాధించింది. చైల్డ్ ప్రొటెక్షన్ లో 49కి 3.52 మాత్రమే వచ్చాయి. గ్లోబల్ NCAP నిర్వహించిన పరీక్షలో Ignis కారు 34 పాయిట్లకు 16.48 సాధించింది. పిల్లల రక్షణ విషయంలో ఇది 49కి 3.52 పాయింట్లు మాత్రమే సాధించింది. దీనిని రూ.5.84 లక్షల నుంచి రూ. 8.25 లక్షల వరకు విక్రయిస్తున్నారు.