Homeబిజినెస్Safest cars in India: Safety గా ఉండే బెస్ట్ కార్లు ఇవే.. రేటింగ్ ఎంత...

Safest cars in India: Safety గా ఉండే బెస్ట్ కార్లు ఇవే.. రేటింగ్ ఎంత పొందాలంటే..

Safest cars in India: నేటి కాలంలో కార్లు కొనేవారు చాలా విషయాలను పరిశీలిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కారు సేఫ్టీ విషయంలో ఎంత రైటింగ్ పొందింది? అనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రతి కారుకు గ్లోబల్ లేదా దేశంలో టెస్ట్ చేసి దానికి రేటింగ్ ఇస్తుంటారు. ఒక కారు అత్యంత సెక్యూరిటీని ఇస్తే దానికి 5 స్టార్ రేటింగ్ ఇస్తుంటారు. దానికంటే తక్కువ భద్రత లక్షణాలను కలిగి ఉంటే ఆ తర్వాత సెక్యూరిటీ నెంబర్ ఇస్తుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో కొన్ని రకాల కార్లు వివిధ రకాల రేటింగ్ పొంది ఉన్నాయి. మరి వీటిలో ఏ కారు ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంది? ఎంత స్టార్ రేటింగ్ తో నమోదయింది? అనే వివరాలను పరిశీలిద్దాం..

HYUNDAI కంపెనీ నుంచి వివిధ రకాల కార్లు మార్కెట్లోకి ఇప్పటికే వచ్చాయి.. మరికొన్ని రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే దీని నుంచి ఇప్పటికే వెలువడిన Venue కారు 5 స్టార్ రేటింగ్ సెక్యూరిటీని పొందింది. 2026 మార్చి నెలలో ఈ కారును భారత్ లోని NCAP లో టెస్ట్ చేశారు. దీంతో పెద్దల భద్రతలో ఇది 31.15 నుంచి 32. వరకు రేటింగ్ పొందింది. పిల్లల సంరక్షణలో 44. 46 నుంచి 49 పాయింట్ల వరకు వచ్చాయి. ఈ కారులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, 3 పాయింట్ సీటు బెల్టు, చైల్డ్ సీట్ యాంకర్లు వంటివి ఉన్నాయి. అలాగే లెవెల్ 2 ADAS, 360 డిగ్రీ కెమెరా వంటివి కూడా ఉండడంతో ఈ కారు అత్యంత భద్రత లక్షణాలను కలిగి ఉన్నదని అర్థమవుతుంది.

Kia కంపెనీ ఎక్కువగా SUV కారులను ఉత్పత్తి చేస్తుందని తెలుసు. అయితే దీని నుంచి రిలీజ్ అయిన Seltos కారు కూడా 5 స్టార్ రేటింగ్ పొందింది. ఈ కారు అడల్ట్ సేఫ్టీలో 31.70 పాయింట్లు సాధించింది.. చైల్డ్ సేఫ్టీ లో 45 పాయింట్లు సాధించింది. ఇందులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, EBD తో కూడిన ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటివి ఉన్నాయి. అలాగే 360 డిగ్రీ కెమెరా కూడా ఉండడంతో అత్యంత రక్షణతో ఉంటుంది.

Tata కంపెనీకి చెందిన Sierra కారు కూడా ప్రయాణికుల రక్షణలో మంచి రేటింగ్ను పొందింది. ఈ కారు డిజైన్ విషయంలో కూడా ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ కారును భారత్ లోని NCAP లో పరీక్షించగా పెద్దల సంరక్షణలో 31.14, పిల్లల రక్షణలో 44.73 పాయింట్లును పొందింది. ఇందులో కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, 22 ఫీచర్లతో లెవెల్ 2 ADAS, 360 డిగ్రీ కెమెరా, EBD తో కూడిన ABS మల్టీ ఫీచర్లు ఉన్నాయి.

Vinfast కంపెనీకి చెందిన VF 6 కారు సైతం ప్రయాణికులకు అత్యంత రక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారు వయోజన సంరక్షణంలో 27.13 పాయింట్లు పొందగా.. పిల్లల రక్షణలో 44. ఫోర్ వన్ పాయింట్ సాధించింది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఈ విధంగా ఈ కార్లు అత్యంత రక్షణతో కూడుకొని ఉన్నట్లు తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version