Mudragada Padmanabham Daughter: ఆడపిల్ల కైనా సరే తండ్రి అంటే వల్ల మాలిన అభిమానం ఉంటుంది. తండ్రి చనిపోతే గుండెలు పగిలిపోయే విధంగా ఏడుస్తుంది. పేదింట్లో పుట్టిన ఆడపిల్లలే కాదు.. శ్రీమంతుల పిల్లలు కూడా ఇలానే ఏడుస్తుంటారు. ఎందుకంటే ఆడపిల్లకు తండ్రితో ఉండే అనుబంధం చాలా గొప్పగా ఉంటుంది. తన తండ్రిని ప్రతి ఆడపిల్ల సూపర్ హీరోగా భావిస్తూ ఉంటుంది. ఆ తండ్రి చనిపోతే.. కడసారి చూసే చూపుకు కూడా నోచుకోలేక పోతే ఆ బాధ మామూలుగా ఉండదు.
ఇప్పుడు ఈ బాధను కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి అనుభవిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం వైసిపి నేతగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గనుక అధికారంలోకి వస్తే తన పేరు వెనుక రెడ్డి అని చేర్చుకుంటానని చెప్పారు. దానికి తగ్గట్టుగానే ముద్రగడ పద్మనాభ రెడ్డి అని తన పేరును మార్చుకున్నారు. అయితే తండ్రి తీరును నాడు క్రాంతి తప్పు పట్టారు. కేవలం తండ్రి రాజకీయ విధానాలను మాత్రమే ఆమె తప్పు పట్టారు. అంతేతప్ప వ్యక్తిగతంగా దూషించలేదు.. పైగా క్రాంతి జనసేన నాయకురాలుగా కొనసాగుతున్నారు.
ఇటీవల ముద్రగడ పద్మనాభం అనారోగ్యానికి గురైనప్పుడు క్రాంతి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వెళ్లి తండ్రిని పరామర్శించడానికి ప్రయత్నిస్తే అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో తన బాధను సోషల్ మీడియా వ్యక్తిగా వ్యక్తం చేశారు క్రాంతి. రాజకీయంగా అవసరం ఉన్నప్పుడు పద్మనాభాన్ని జగన్ వాడుకున్నారని.. ఇప్పుడు అనారోగ్యానికి గురైతే పట్టించుకోవడంలేదని ఆమె ఆరోపించారు. సహజంగా క్రాంతి చేసిన ఆరోపణలు జగన్ కు ఇబ్బంది కలిగించాయి. కూటమి నేతలు ఇదే అదునుగా జగన్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు.
పద్మనాభం చనిపోయిన తర్వాత.. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి.. నివాళులు అర్పించడానికి క్రాంతి వచ్చారు. ఈ సమయంలో ఇక్కడ వైసిపి రాజకీయాలు మొదలుపెట్టింది. క్రాంతిని ఒక కుమార్తెలాగా చూడకుండా.. జనసేన నాయకురాలి గానే చూసింది. గో బ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు చేసింది. దీనికి తోడు పద్మనాభం మాతృమూర్తి కూడా వైసిపి ట్రాప్ రాజకీయాలలో పడ్డారు. ఆమె కూడా తన కుమార్తెను తన భర్త పార్దేవ దేహాన్ని చూసేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. దీంతో క్రాంతి తన తండ్రిని చూసేందుకు ప్రయత్నించగా.. వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ఆ సమయంలో వైసీపీ నేతలు వర్సెస్ జనసేన నేతలు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో క్రాంతి తన తండ్రి చివరి చూపు చూసుకోకుండానే వెనక్కి వచ్చేశారు. వైసీపీ రాజకీయాలు ఇలానే ఉంటాయని.. చివరికి ఒక ఆడపిల్లను ఇలా ఇబ్బంది పెడతారని.. తండ్రి చనిపోయిన బాధలో ఉంటే మరింత ఏడిపిస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. షర్మిలకే తప్పలేదు క్రాంతి ఎంత అంటూ వివరిస్తున్నారు.
