Chandrababu AC buses announcement: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీలో ప్రవేశపెట్టే కొత్త బస్సులన్నీ ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వెయ్యికి పైగా ఈవీ బస్సులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసుకుంది. అయితే ఇక నుంచి పల్లె వెలుగు గ్రామీణ సేవల్లో కూడా కొత్తగా ప్రవేశపెట్టే అన్ని కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ఏసీలే ఉండాలని సీఎం తాజాగా సూచించారు. ఎందుకంటే?
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “డబ్బులు ఉన్న వారే కాదు, పేదలు కూడా గౌరవంగా ఏసీ బస్సుల్లో ప్రయాణించాలనేదే తన కోరిక” అని స్పష్టం చేశారు. ప్రజలందరికీ ఆర్థికంగా అందుబాటులో ఉండే ఏసీ ఎలక్ట్రిక్ బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజా రవాణాను ఆధునికం, పర్యావరణ అనుకూలం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రకటన ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి సౌకర్యం, సౌఖ్యం, కాలుష్య తగ్గింపు అన్నీ ఒకేసారి లభించేలా చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఏపీలో సుమారు వెయ్యి ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి; ఇంకా 4 వేలకు పైగా కొత్త ఛార్జింగ్ స్టేషన్లను పట్టణ ప్రాంతాలు, గ్రామాలు, హైవేలు, పెట్రోల్ బంకులు, హోటళ్లు వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ప్రభుత్వం చేతిలో ఉంది.
ప్రభుత్వ పాలనలో వచ్చిన పెట్టుబడులు, ఉపాధి సృష్టి గురించి సీఎం చంద్రబాబు అనకాపల్లిలో వివరించారు. కూటమి కూటమి పాలన హయాంలో సుమారు 5.95 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, దీంతో దాదాపు 4.76 లక్షల మందికి పైగా ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. రాంబిల్లిలో రూ.5,400 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న సోలార్ ఇన్ గాట్ వేఫర్ ఉత్పత్తి ప్లాంట్ కు ఆయన శంకు స్థాపన చేశారు. ఈ ప్లాంట్ నిర్మాణంతో విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంని న్నారు. మరోవైపు కేవలం సంపన్నులు మాత్రమే ఏసీ బస్సుల్లో ప్రయాణించడం కాదని.. సామాన్య పేద ప్రజలు కూడా గౌరవంగా తిరిగేలా ఏస బస్సులు ఉండాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబునాయుడు తెలిపారు.