రూ.5లక్షల పెట్టుబడితో రూ.10 లక్షల రిటర్స్.. ఈ పోస్టాఫీస్ స్కీం గురించి తెలుసా?

పోస్టాఫీసుల పథకాల్లో ‘కిసాన్ వికాస పత్రం’ ఫేమస్ గా ఉంటుంది. ఇందులో ఇన్వెస్ట్ మెంట్ చేస్తే రెట్టింపు డబ్బు రిటర్న్ వస్తుంది. కనీసం రూ.1000 నుంచి పరిమితి లేకుండా డబ్బు ను ఇన్వెస్ట్ మెంట్ చేయొచ్చు. ముందుగా ఈ పథకం ద్వారా పెట్టుబడి పెట్టాలనుకుంటే కిసాన్ వికాస పత్ర యోజన కింద అకౌంట్ తీయాల్సి ఉంటుంది.

Written By: Srinivas, Updated On : June 19, 2024 3:26 pm
Follow us on

డబ్బు సేవింగ్స్ చేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ సేవింగ్స్ చేసే దానిపై వడ్డీ రావాలని అనుకుంటారు. అయితే ఎలాంటి పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువ వడ్డీ వస్తుందో తెలుసుకోవడం ఉత్తమం. మార్కెట్లో చాలా రకాల ఇన్వెస్ట్ మెంట్స్ ఉన్నాయి. కానీ కొన్నింటిలో మాత్రమే అధిక వడ్డీ వస్తుంటాయి. వీటిలో ముఖ్యంగా బ్యాంకుల్లో కంటే పోస్టాఫీసుల్లో ఎక్కవ లాభం ఉంటుంది. అయితే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. పోస్టాఫీసుల్లో ఉన్న ఓ పథకం ద్వారా రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే రెట్టింపు రిటర్న్స్ వస్తాయి. ఆ స్కీం గురించి తెలుసుకుందాం..

పోస్టాఫీసుల పథకాల్లో ‘కిసాన్ వికాస పత్రం’ ఫేమస్ గా ఉంటుంది. ఇందులో ఇన్వెస్ట్ మెంట్ చేస్తే రెట్టింపు డబ్బు రిటర్న్ వస్తుంది. కనీసం రూ.1000 నుంచి పరిమితి లేకుండా డబ్బు ను ఇన్వెస్ట్ మెంట్ చేయొచ్చు. ముందుగా ఈ పథకం ద్వారా పెట్టుబడి పెట్టాలనుకుంటే కిసాన్ వికాస పత్ర యోజన కింద అకౌంట్ తీయాల్సి ఉంటుంది. అయితే ఈ ఖాతాను 10 లేదా ఆ పైబడి సంవత్సరాలు ఉన్న వారి పేరిట తీయాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఎన్ని ఖాతాలైనా తీసుకోవచ్చు.

ఉదాహరణకు ఈ పథకం కింద గరిష్టంగా రూ.5 లక్షల పెట్టుబడి పెడితే 10 సంవత్సరాల వరకు 7.5 శాతం వడ్డీతో కలిపి రెట్టింపు అమౌంట్ వస్తుంది. ఈ ఇన్వెస్ట్ మెంట్ ఒకేసారి లేదా నెలా నెలా వాయిదాల పద్దతిన కూడా చెల్లించే అవకాశం ఉంది. కిసాన్ వికాస్ పత్ర యోజన కింద ఖాతా తీసుకునే వారు ఈ రకమైన పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే ఇవి చిన్న పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ మెంట్ చేయడం ద్వారా భవిష్యత్ లో వారి అవసరాలకు ఉపయోగపడుతాయి.