Royal Enfield : మనదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్ఫుల్ ఇంజన్, స్ట్రాంగ్ బాడీ, రోడ్డు మీద దీని తిరుగులేని డామినేషన్ ఈ బైక్‌ల సొంతం. అంతేకాదు, ఈ బైక్‌లపై వేల కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణాలు కూడా చేయవచ్చు. అయితే, ఈ మేడ్ ఇన్ ఇండియా బైక్‌లను పాకిస్తాన్ ప్రజలు కూడా చాలా లైక్ చేస్తున్నారు. కానీ పాక్ కుటిల బుద్ధి కారణంగా వారు ఈ బైక్‌లను నేరుగా కొనలేరు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రకారం.. పాకిస్తాన్లో కంపెనీ బైక్స్ అధికారికంగా విక్రయించబడవు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒక భారతీయ బ్రాండ్ , భారత్-పాకిస్తాన్ మధ్య వాణిజ్య సంబంధాలు సరిగా లేనందున కంపెనీకి పాకిస్తాన్‌లో అధికారిక డీలర్‌షిప్ లేదు.
Also Read : నో ఝలక్.. ఓన్లీ స్మూత్ రైడింగ్.. కొత్త హంటర్ 350 వచ్చేస్తోంది!
పాకిస్తాన్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు నేరుగా ప్రైవేట్ ఇంపోర్ట్ ద్వారా భారతదేశం, దుబాయ్ లేదా ఏదైనా మూడవ దేశం నుండి తెప్పిస్తుంది. దీని కోసం పాకిస్తాన్ కస్టమ్స్ చట్టాల ప్రకారం ఇంపోర్ట్ డ్యూటీ , పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కస్టమ్ క్లియరెన్స్ తర్వాత బైక్‌ను రిజిస్టర్ కూడా చేయించాలి. రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశం నుంచి వెళ్తుంది. పాకిస్తాన్‌తో భారతదేశానికి వాణిజ్య సంబంధాలు లేనందున, కొన్నిసార్లు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ లేదా ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ చాలా కఠినంగా వ్యవహరిస్తాయి. దీని కారణంగా ఇంపోర్ట్ డ్యూటీ చాలా ఎక్కువగా ఉండవచ్చు.కొన్నిసార్లు బైక్ అసలు ధర కంటే కూడా చాలా ఎక్కువ అవుతుంది.
పాకిస్తానీలు బైక్‌లను ఎలా కొంటారు?
పాకిస్తాన్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా బైక్ లవర్స్, వింటేజ్ బైక్ కలెక్టర్లు, లాంగ్ రైడింగ్ ఇష్టపడే వారి మధ్య ఈ బైక్‌లు చాలా పాపులారిటీ పొందాయి. అయితే ఈ బైక్‌లను ప్రైవేట్ ఇంపోర్ట్ ద్వారా తెప్పించుకోవడం చాలా ఖరీదైనది. అందుకే కరాచీ, లాహోర్‌లోని కొంతమంది ప్రైవేట్ బైక్ డీలర్లు తమకున్న కాంటాక్ట్స్‌తో దుబాయ్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి ఇతర దేశాల నుంచి బైక్‌లను తెప్పించి పాకిస్తాన్‌లో విక్రయిస్తున్నారు. OLX, ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్ , బైక్ కస్టమైజేషన్ వర్క్‌షాప్‌లు ఈ బైక్‌లను ఇంపోర్ట్ చేసి రీసేల్ చేస్తాయి.
ప్రతి సంవత్సరం పాకిస్తాన్‌లో దాదాపు వందల సంఖ్యలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు ప్రైవేట్‌గా ఇంపోర్ట్ అవుతాయి. వాటిలో ఎక్కువగా క్లాసిక్ 350, బుల్లెట్ 350, ఇంటర్‌సెప్టర్ 650 వంటి మోడళ్లు ఉంటాయి. పాకిస్తాన్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు చాలా ఖరీదైనవి. ఎందుకంటే వాటిపై భారీగా ఇంపోర్ట్, కస్టమ్ డ్యూటీ విధిస్తారు. ఉదాహరణకు క్లాసిక్ 350 బేస్ ధర 7 లక్షల PKR (భారతీయ మారకం విలువ ప్రకారం) ఉంటే, అది పాకిస్తాన్ చేరుకునేసరికి దాని ధర దాదాపు 14 నుండి 15 లక్షలు అవుతుంది. ఇందులో షిప్పింగ్ ఖర్చులు, కస్టమ్ డ్యూటీ, ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. ఈ విధంగా పన్నుల ద్వారా పాకిస్తాన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లపై భారీగా సంపాదిస్తోంది.
Also Read : భారతీయ బైక్‌కు అంతర్జాతీయ గుర్తింపు.. నేపాల్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హవా!