Rajamouli and Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి సినిమాలకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసిన ఆయన రెండో షెడ్యూల్ ని కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసే విధంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్ లనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు రికార్డులను సైతం బ్రేక్ చేయాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తద్వారా ఈ సినిమాలతో ఆయన ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. మరి ఏది ఏమైనా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్న రాజమౌళి ఇప్పుడు మాత్రం జేమ్స్ కామెరూన్ సరసన తన పేరు నిలుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎలిమెంట్స్ ని కూడా డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Raed : బాలీవుడ్ హీరోలను కాదని రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేయడానికి కారణం ఏంటంటే..?
ఇక మహేష్ బాబు ఒక నిధి వేట కోసం ముందుకు సాగుతున్న క్రమంలో పులులు, డైనోసార్లతో పాటు సింహాలతో కూడా ఫైటింగ్ చేసే సన్నివేశాలు ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో తన పేరు ప్రపంచం మొత్తం తెలిసేలా ప్రమోట్ చేసుకున్న రాజమౌళి ఈ సినిమాతో భారీ అవార్డులను సైతం సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు.
తను అనుకున్నట్టుగానే ఇకమీదట రాబోయే సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టించి తెలుగు సినిమా స్థాయిని సైతం ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బ్రేక్ చేసే సినిమాలను చేసిన ఆయన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రికార్డులను కొల్లగొడతాడా? తద్వారా ఆయనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read : రాజమౌళి మహేష్ సినిమాలో ఆ ఒక్క సీన్ కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నాడా..?