Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏప్రిల్ 26న భారతీయ మార్కెట్లో 2025 హంటర్ 350ని విడుదల చేయడానికి రెడీగా ఉంది. అదే రోజున బ్రాండ్ కొన్ని నగరాల్లో హంటర్హుడ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. ఈ మోటార్‌సైకిల్‌ను మొదటిసారిగా 2022లో ప్రవేశపెట్టారు.అప్పటి నుండి హంటర్ 350.. 5 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. కొత్త హంటర్ 350 ఇప్పుడు ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లలో ఉన్న LED హెడ్‌లైట్‌ను అందించింది.
Also Read : నో ఝలక్.. ఓన్లీ స్మూత్ రైడింగ్.. కొత్త హంటర్ 350 వచ్చేస్తోంది!
దీంతో పాటు వెనుకవైపు కొత్త సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఇది మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత తరం హంటర్ 350 అతి పెద్ద సమస్య దాని వెనుక సస్పెన్షన్ చాలా స్ట్రాంగ్ ఉండడం. చివరగా కొత్త కలర్ ఆఫ్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ధర రూ.1.50 లక్షల నుండి రూ.1.75 లక్షల మధ్య ఉంది. ఈ రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ప్రకారం ఉంటాయి. 2025 మోడల్‌తో ధరలలో స్వల్ప పెరుగుదల ఉండవచ్చు.
ఇంజిన్, పవర్
కొత్త హంటర్ 350 J-సిరీస్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 20.2 bhp పవర్, 27 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌ను 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది బ్రాండ్ ఇతర 350సీసీ బైక్‌లలో కనిపించే అదే ఇంజిన్. అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కోసం ఫ్యూయల్, ఇగ్నిషన్ మ్యాప్‌ను తిరిగి ట్యూన్ చేసింది. బ్రేకింగ్ కోసం ముందువైపు 300 మిమీ డిస్క్, వెనుక 270 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. బైక్ ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుకవైపు 6-స్టెప్ ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి.
మైలేజ్
ఈ బైక్ లీటరుకు 36 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే, రియల్ టైంలో ఇది కొంచెం తక్కువగా ఉండవచ్చు. బైక్ బరువు 177 కేజీలు. సీటు ఎత్తు 800 మిమీ, ఇది తక్కువ ఎత్తు ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు. రాయల్ ఎన్‌ఫీల్డ్ కావడంతో దీనికి అనేక రకాల యాక్సెసరీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అనేక రకాల ఇంజిన్ గార్డ్‌లు, సంప్ గార్డ్‌లు, వివిధ రకాల సీట్లు, LED టర్న్ ఇండికేటర్‌లు, బార్ ఎండ్ మిర్రర్‌లు, టూరింగ్ మిర్రర్‌లు, టింటెడ్ ఫ్లై స్క్రీన్, బ్యాక్ రెస్ట్, పానియర్, పానియర్ రైల్‌లు ఉన్నాయి.
Also Read : భారతీయ బైక్‌కు అంతర్జాతీయ గుర్తింపు.. నేపాల్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హవా!