SRH Vs Mi IPL 2025: రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ సెంచరీ చేయడంతో ఒక్కసారిగా సంచలనం నమోదయింది. కావ్య మారన్ సరైన ఆటగాడిని కొనుగోలు చేసిందని వ్యాఖ్యలు వినిపించాయి. కానీ అది ప్రారంభ శూరత్వం అని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. అలా రావడం ఇలా వెళ్ళిపోవడం.. ఒక్క మ్యాచ్లో కూడా తన మార్క్ ఇన్నింగ్స్ ఆడ లేకపోవడం.. వంటివి ఇషాన్ కిషన్ పరువు తీస్తున్నాయి. వాస్తవానికి ముంబై జట్టులో ఉన్నప్పుడు ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడేవాడు. తనదైన బ్యాటింగ్ తో ఆకట్టుకునేవాడు. జట్టులో గొప్ప గొప్ప ఆటగాళ్లు విఫలమైనప్పటికీ అతడు గట్టిగా నిలబడేవాడు. కానీ అదే దరిద్రమో.. హైదరాబాద్ జట్టుకు తొలి మ్యాచ్ మినహా.. ఇంతవరకు ఒక గట్టి ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. అసలు ఎందుకు ఆడుతున్నాడో.. ఎందుకు మైదానంలోకి వస్తున్నాడో.. అతడికే అర్థం కావడం లేదు. ఇన్ని సార్లు విఫలమవుతున్నప్పటికీ హైదరాబాద్ మేనేజ్మెంట్ అతనికి అవకాశాలు ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Also Read: రక్తం ఉడికిపోతుంది.. ఇకపై ఊరుకునేది లేదు.. పహల్గాం ఉగ్రదాడిపై RCB మాజీ ఆటగాడు!
అవుట్ కాకున్నా..
ముంబై జట్టుతో హైదరాబాద్లో జరుగుతున్న మ్యాచ్లో ఇషాన్ కిషన్ తొందరపడ్డాడు. తొందరపడి ఓ కోయిల ముందే కూసినట్టు.. అవుట్ కాకున్నా మైదానం నుంచి త్వరగా నే వెళ్లిపోయాడు. దీంతో ఒక్కసారిగా అతడు తీరుపై విమర్శలు మొదలయ్యాయి.. ఈ మ్యాచ్లో దీపక్ చార్ లెగ్ సైడ్ వేసిన బంతిని కిషన్ ఆడబోయాడు. కానీ ఆ బంతి నేరుగా వెళ్లి కీపర్ రికెల్టన్ చేతిలో పడింది. అప్పటికి ముంబై ఆటగాళ్లు అంపైర్ కు అప్పీల్ చెయ్యలేదు.. కానీ ఇషాన్ కిషన్ మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. అతడు వెళ్లి పోవడం చూసి అంపైర్ అవుట్ ఇచ్చాడు.. దానికి ముంబై ప్లేయర్లు కూడా షాక్ అయ్యారు. ఐతే రిప్లై లో ఇషాన్ కిషన్ బ్యాట్ కు బంతి తగలలేదని తేలింది. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాకపోతే ఇషాన్ కిషన్ తొందరపడకపోయి ఉంటే హైదరాబాద్ జట్టు మరిన్ని ఎక్కువ పరుగులు చేసేది. కానీ ఇషాన్ కిషన్ వల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబై ఎదుట తలవంచాల్సి వచ్చింది.
Fairplay or facepalm?
Ishan Kishan walks… but UltraEdge says ‘not out!’ What just happened?!
Watch the LIVE action ➡ https://t.co/sDBWQG63Cl #IPLonJioStar #SRHvMI | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/bQa3cVY1vG
— Star Sports (@StarSportsIndia) April 23, 2025
ఒక్క సెంచరీ తప్ప
ఈ సీజన్లో కిషన్ ఒకే ఒక్క సెంచరీ చేశాడు. ఆ తర్వాత వరుసగా విఫలమవుతున్నాడు. అనామక ఆటగాడి లాగా ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. అతని బ్యాటింగ్లో ఏమాత్రం కొత్తదనం కనిపించడం లేదు. అసలు అతడు ఎందుకు ఆడుతున్నాడో అతడికైనా అర్థమవుతుందో లేదో.. ఇంతలా విఫలమవుతున్నప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం ఎందుకు అవకాశాలు ఇస్తుందో అంత పట్టడం లేదు. కిషన్ మాత్రమే కాదు నితీష్ కుమార్ రెడ్డి, హెడ్ కూడా దారుణంగా ఆడుతున్నారు. భారీ అంచనాలు పెట్టుకుంటే వాటిని తలకిందులు చేసి వస్తున్నారు.
Also Read: కాటేరమ్మ కొడుకులనుకుంటే.. చెత్త రికార్డు నెత్తిన పెట్టుకున్నారు..