Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 2025 హంటర్ 350ని ఏప్రిల్ 26న భారతదేశంలో విడుదల చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. అలాగే సెలెక్టెడ్ నగరాల్లో బ్రాండ్ హంటర్‌హుడ్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహిస్తోంది. ఈ పాపులర్ నియో-రెట్రో రోడ్‌స్టర్ బైక్‌ను మొదటిసారిగా ఆగస్టు 2022లో విడుదల చేశారు. ఇప్పుడు దాదాపు మూడేళ్ల తర్వాత ఇందులో పెద్ద అప్‌డేట్ రాబోతోంది. కంపెనీ కేవలం మూడు సంవత్సరాలలోనే ఈ బైక్ 5 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించింది. హంటర్ 350 కంపెనీ లైనప్‌లో అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది.
Also Read : నో ఝలక్.. ఓన్లీ స్మూత్ రైడింగ్.. కొత్త హంటర్ 350 వచ్చేస్తోంది!
2025 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో చాలా తక్కువ కానీ ముఖ్యమైన అప్‌డేట్‌లు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే ఇప్పుడు బైక్‌లలో LED హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. వీటిని ఇదివరకే ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లలో చూశాము. మరొక ముఖ్యమైన అప్‌గ్రేడ్ కొత్త రియర్ సస్పెన్షన్ సెటప్. ప్రస్తుత మోడల్ హార్డ్ రియర్ షాకర్‌లు దాని అతిపెద్ద బలహీనతగా చెబుతున్నారు. కొత్త సిస్టమ్‌తో మెరుగైన రైడ్ కంఫర్ట్ లభిస్తుందని భావిస్తున్నారు. దీనితో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఆకర్షణను నిలబెట్టడానికి కొత్త కలర్ ఆప్షన్‌లను కూడా అందించనుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ప్రస్తుత మోడల్ ధర రూ.1.50 లక్షల నుండి రూ.1.75 లక్షల వరకు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) ఉంది. అయితే హంటర్ 350 ఈ కొత్త 2025 మోడల్ అప్‌డేట్‌లతో వస్తుండటంతో ధర కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితమైన గణాంకాలు ఏప్రిల్ 26న ప్రకటిస్తారు. కొత్త మోడల్ ధర ప్రతి వేరియంట్‌కు ప్రస్తుత మోడల్ కంటే దాదాపు రూ.5,000 నుండి రూ.10,000 వరకు ఎక్కువగా ఉండవచ్చు.
మెకానికల్‌గా హంటర్ 350లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇందులో 349 cc J-సిరీస్ ఇంజన్ అమర్చబడి ఉంది, ఇది 20.2 bhp పవర్, 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో వస్తుంది. ఈ ఇంజన్‌నే కంపెనీ ఇతర 350సీసీ బైక్‌లలో కూడా ఉపయోగిస్తుంది. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ కోసం ఇంజన్‌లో కొద్దిగా మార్పులు చేసింది. బైక్‌లో బ్రేకింగ్ కోసం 300ఎంఎం ఫ్రంట్ డిస్క్, 270ఎంఎం రియర్ డిస్క్ ఉన్నాయి. ఇవి వేరియంట్‌ను బట్టి సింగిల్ లేదా డ్యూయల్-ఛానల్ ABSకు సపోర్ట్ చేస్తాయి.
Also Read : భారతీయ బైక్‌కు అంతర్జాతీయ గుర్తింపు.. నేపాల్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హవా!