రూ.100 ఆదా చేస్తే రూ.10 లక్షలు పొందే అవకాశం.. ఎలా అంటే?

మనలో చాలామంది రిస్క్ లేకుండా డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. అలా సంపాదించాలని భావించే వాళ్ల కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఉత్తమమని చెప్పవచ్చు. ఎవరైతే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో చేరతారో వాళ్లు ప్రతి నెలా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను కచ్చితంగా పొందే అవకాశాలు ఉంటాయి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి వచ్చే రాబడి ఆధారపడి […]

Written By: Kusuma Aggunna, Updated On : August 3, 2021 6:50 pm
Follow us on

మనలో చాలామంది రిస్క్ లేకుండా డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. అలా సంపాదించాలని భావించే వాళ్ల కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఉత్తమమని చెప్పవచ్చు. ఎవరైతే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో చేరతారో వాళ్లు ప్రతి నెలా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను కచ్చితంగా పొందే అవకాశాలు ఉంటాయి.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి వచ్చే రాబడి ఆధారపడి ఉంటుందని సమాచారం. ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ పై 7.1 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు కాగా ఈ స్కీమ్ లో చేరడం వల్ల 15 సంవత్సరాలు డబ్బులు పెడుతూనే ఉండాలి. 15 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల చొప్పున గడువును పొడిగించుకునే అవకాశం ఉంటుంది.

సంవత్సరానికి లక్షన్నర రూపాయలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. నెలకు ఏకంగా 3,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 10 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ ను కూడా పొందే అవకాశాలు అయితే ఉంటాయి. నెలకు 12,500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం 25 సంవత్సరాల తర్వాత కోటి రూపాయలకు పైగా వస్తాయి.

రోజుకు కేవలం 416 రూపాయలు ఆదా చేయడం ద్వారా సులభంగా కోటీశ్వరులు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.