https://oktelugu.com/

రాజ్ కుంద్రా కేసు: నగ్నంగా వీడియో షేర్ చేసిన బాలీవుడ్ నటి

రాజ్ కుంద్రా కేసులో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ నటి గెహనా వశిష్ట్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాజాగా ఆమె తన ఒంటిపై నూలుపోగు లేకుండా ఇన్ స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి అభిమానులకు షాకిచ్చింది. అయితే ఆమె ఇలా చేయడానికి బలమైన కారణం ఉంది.. రాజ్ కుంద్రా కేసులో అశ్లీలత గురించి చర్చ జరుగుతూ తనను అవమానిస్తున్న వారికి షాకిచ్చేందుకు నటి గెహనా ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తన […]

Written By:
  • NARESH
  • , Updated On : August 3, 2021 / 04:42 PM IST
    Follow us on

    రాజ్ కుంద్రా కేసులో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ నటి గెహనా వశిష్ట్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాజాగా ఆమె తన ఒంటిపై నూలుపోగు లేకుండా ఇన్ స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి అభిమానులకు షాకిచ్చింది. అయితే ఆమె ఇలా చేయడానికి బలమైన కారణం ఉంది..

    రాజ్ కుంద్రా కేసులో అశ్లీలత గురించి చర్చ జరుగుతూ తనను అవమానిస్తున్న వారికి షాకిచ్చేందుకు నటి గెహనా ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తన నిరసనను ఇలా తెలియజేసినట్టుగా చెబుతున్నారు.

    అశ్లీలత గురించి దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లకు,మీడియాకు షాకిచ్చేలా నటి గెహానా ఈ వీడియోను షేర్ చేసింది. ‘కేవలం బట్టలు లేకుండా ఉండడం వల్ల అందంగా లేదా అసభ్యంగా ఉందో తెలుసుకోవాలనుకుంది’ అని నటి గెహానా పేర్కొంది. ‘బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నాను. ఇప్పుడెలా ఉన్నానో చెప్పండి.. అందంగా ఉన్నానా? అసభ్యంగా అనిపిస్తోందా? అశ్లీలంగా ఉందా?’ అంటూ ఫ్యాన్స్ ను అడిగింది.. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘బట్టలు లేకుండా లైవ్ లోకి వచ్చాను.. కానీ ఏ ఒక్కరూ ఇది అశ్లీలం అని చెప్పడం లేదు. పైగా నేను బట్టలు వేసుకున్న సందర్భాల్లోనే కొందరు దాన్ని అశ్లీలం అంటున్నారు. మరీ ఇంత కపటధారుల్లాగా ప్రవర్తించడానికి కూడా ఓ హద్దు ఉంటుంది’ అని క్యాప్షన్ ఇచ్చింది.

    నటి గెహానా చేసిన నగ్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక సంచలనంగా మారింది. నగ్నత్వంపై, అశ్లీలంపై చేస్తున్న విషప్రచారానికి విరుగుడుగా నటి గెహానా చేసిన ఈ పనిపై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు.