వర్షాకాలంలో బైక్ నడపడం చాలా ఇబ్బంది కరమే. ఓ వైపు వాన పడుతుండగా టూ వీలర్ పై వెళ్లాలంటే మనుషులతో పాటు బైక్ తడుస్తుంది. ఇలా వెళ్తుండగా బైక్ లో సమస్యలు వచ్చి ఒక్కోసారి వెంటనే ఆగిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా వరదలు ఎక్కువగా వస్తే బైక్ నీటిలో మునిగే ప్రమాదం ఉంది. ఈ సమయంలో బైక్ లోని కొన్ని పార్ట్స్ దెబ్బతింటాయి. అయితే అప్పటి వరకు బైక్ లో ఉండే సమస్యలు వర్షపు నీరు వెళ్లడంతో అవి మరింత దెబ్బతింటాయి. అందువల్ల ముందు జాగ్రత్తగా బైక్ కు సంబంధించి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవేంటంటే?
ప్రతీ టూవీలర్ కు టైర్లు చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో టైర్లు బాగా లేకపోతే వెంటనే దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో ప్రయాణంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. ముఖ్యంగా వర్షా కాలంలో టైర్లు బాగా లేకపోతే రోడ్డుపై ఉన్న నీటితో స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే టైర్లు గ్రిడ్స్ కోల్పోతే వర్షపు నీటిలో వేగం తగ్గుతుంది. అందువల్ల వర్షకాలం ప్రారంభ సమయంలోనే టైర్లు బాగా లేకపోతే వెంటనే మార్చాలి.
బైక్ నడిపే వారికి హెల్మెట్ తప్పనిసరి. వర్షాకాలంలో బైక్ ఎక్కువగా అదుపు తప్పే అవకాశాలు ఉండనున్నాయి. బైక్ నడిపేవారికి హెల్మెట్ ఉండడం వల్ల ఇలాంటి సమయంలో రక్షణగా ఉంటుంది. అలాగే వర్షాకాలంలో హెల్మెట్ వల్ల తడవకుండా ఉంటారు. అయితే ఈ హెల్మెట్ బాగుందో లేదో ముందే చెక్ చేసుకోండి. సడెన్లీగా వర్షంలో పాడైపోయిన హెల్మెట్ తీసుకెళ్లడం వల్ల వర్షానికి తడవడమే కాకుండా స్కిడ్ సమయంలో గాయాలయ్యే అవకాశం ఉంటుంది.
వర్షం కారణంగా వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. అయితే రాత్రి పూట బైక్ తీసుకెళ్లాలనుకునేవారు బైక్ కు లైట్స్ లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎదుర్కొంటారు. అంతేకాకుండా బ్యాటరీ డిశ్చార్జ్ కారణంగా హారన్ కూడా పనిచేయదు. అందువల్ల ముందు జాగ్రత్తగా బ్యాటరీ బాగుందో లేదో చెక్ చేసుకోండి.. లేదా కొత్త బ్యాటరీ ఏర్పాటు చేసుకోవడం మంచిది.