Kashmir: లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో కశ్మీర్‌లో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఉగ్రదాడులు జరుగుతునాయి. వారం వ్యవధిలో మూడు ఉగ్రదాడులతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఉగ్రదాడులు మొదలు కావడంతో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు.
అస్థిర ప్రభుత్వంమని..
ఉగ్రవాదులకు భారత దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉండడం నచ్చదు. ఎప్పుడూ అస్థిర ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటారు. దీంతో తమకు లబ్ధి చేకూరుతుందన్న భావనలో ఉంటారు. తాజాగా కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వమే ఏర్పడింది. అయినా.. గత ప్రభుత్వాలతో పోలిస్తే.. కాస్త బలహీనపడడంతో ఉగ్రవాదులు కశ్మీర్‌లో మళీల అల్లర్లు సృష్టిస్తున్నారు. అస్థిర రాజకీయాలు నడవాలని కోరుకుంటారు.
పదేళ్లలో చక్కబడిన పరిస్థితులు..
గత పదేళ్లలో మోదీ సర్కార్ స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీంతో 2019లో అధికారంలోకి వచ్చాక జమ్ము కశ్మీర్‌లో ఆర్టిక్ 370 రద్దు చేశారు. స్వతంత్ర భారత దేశంలో భాగంగా ప్రకటించారు. దీంతో కశ్మీర్‌లో క్రమంగా పరిస్థితులు చక్కబడ్డాయి. అయితే తాజాగా అస్థిర ప్రభుత్వం ఏర్పడిందన్న భావనతో దేశంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు ఉగ్రవాదులు.
వరుస ఘటనల కలకలం..
తాజాగా జమ్మూ కశ్మీర్‌లో వరుస ఉగ్ర ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. వారం వ్యవధిలో మూడు దాడులు జరిగాయి. ఆదివారం బస్సుపై దాడిచేశారు. అది మరవక ముందే.. మంగళవారం మరో దాడికి తెగబడ్డారు. ఇందులో ఓ సీఆర్పీఎఫ్ జవన్ మృతిచెందగా ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇద్దరు ఉగ్రవాదులను కూడా సైన్యం మట్టుపెట్టింది. డోరా జిల్లాలోని పఠాన్‌కోట్ రహదారిపై ఉన్న సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ ఘటనలో ఐదురుగు సైనికులు, ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడ్డాడు. కదువ జిల్లాలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. తప్పించుకునే క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఇంటిపై దాడి..
డోరా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న ఓ ఇంటిపై కూడా ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ ఘటనలో ఇంటి యజమాని గాయపడ్డాడు. మంచినీళ్లు అడిగిన ఉగ్రవాదులు తర్వాత గ్రామస్తులు తమను గుర్తుపట్టారని కాల్పులకు తెగబాడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో ఒక ఉగ్రవాదిని హతమార్చారు. మరో ఉగ్రవాది కోసం 15 గంటలు డ్రోన్ల సాయంతో గాలించి మట్టుపెట్టారు.
అస్థిర పర్చడానికి ఉగ్రవాదులు మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారనడానికి ఈ దాడులే నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కేంద్రం ఈ దాడుల నుంచి పాఠం నేర్చుకుని దాడుల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.