https://oktelugu.com/

UPI Payments: యూపీఐ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు.. అదే జరిగితే ఎన్పీసీఐ చరిత్ర సృష్టించినట్టే..

పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చే కొత్త నిబంధనల వల్ల యూపీఏ చెల్లింపులు సర్టిఫికేషన్ కోసం స్మార్ట్ ఫోన్ లోని బయోమెట్రిక్ లేదా ఫేస్ ఐడి ఉపయోగించాల్సి రావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది సర్వ సాధారణంగా మారింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 10, 2024 9:41 am
    UPI Payments(1)

    UPI Payments(1)

    Follow us on

    UPI Payments: స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత.. డిజిటల్ చెల్లింపుల్లో సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. మనదేశంలో కిళ్ళి కొట్టు నుంచి మొదలుపెడితే ఫైవ్ స్టార్ హోటల్ వరకు ఎంత మొత్తమైనా లిప్తపాటు కాలంలో యూపీఐ ద్వారా చెల్లెలు చేసుకునే అవకాశం ఉంది. డబ్బులు ఎదుటి వ్యక్తికి పంపించేందుకు కేవలం నాలుగు లేదా ఆరు అంకెల నమోదు చేస్తే చాలు.. క్షణాల్లో డబ్బు ఎదుటి వ్యక్తి ఖాతాలో చేరిపోతుంది. అయితే మంచి వెనుక చెడు ఉన్నట్టు విశేషమైన ప్రాచుర్యం పొందిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో మోసాలు కూడా జరుగుతున్నాయి. దీనివల్ల ఖాతాదారులు డబ్బు నష్టపోతున్నారు. ఈ క్రమంలో ఈ చెల్లింపుల వ్యవస్థను అత్యంత సురక్షితంగా మార్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది. దీనివల్ల మోసాలు తగ్గుముఖం పడతాయని ఆ సంస్థ భావిస్తోంది.

    పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చే కొత్త నిబంధనల వల్ల యూపీఏ చెల్లింపులు సర్టిఫికేషన్ కోసం స్మార్ట్ ఫోన్ లోని బయోమెట్రిక్ లేదా ఫేస్ ఐడి ఉపయోగించాల్సి రావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది సర్వ సాధారణంగా మారింది. ఐఫోన్లలో ఫేస్ ఐడి అనేది ఇన్ బిల్ట్ గా ఉంటుంది. ఇకపై యూపీఐ చెల్లింపుల కోసం ఫోన్లలో ఉండే ఈ బయోమెట్రిక్ సదుపాయాలను ఉపయోగించుకోవాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యోచిస్తోంది. దీనికోసం యూపీఐ సేవలో యూజర్లకు అందిస్తున్న అమెజాన్ పే, పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే యూజర్ల కోసం పిన్ లేదా బయోమెట్రిక్ ఆప్షనల్ గా ఆయా కంపెనీలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

    దీనివల్ల ఏమవుతుంది

    డిజిటల్ పేమెంట్స్ లో డబ్బు చెల్లింపు లేదా స్వీకరణ అనేది అత్యంత సులభతరంగా మారింది. దీంతో చాలామంది బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండానే తమ ఆర్థిక వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు ప్రభుత్వం ఊహించిన దాని కంటే జోరు పెరిగాయి. ఇదే సమయంలో మోసాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో చెల్లింపులు వ్యవస్థను మరింత సురక్షితవంతంగా మార్చేందుకు పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నడుం బిగించింది. సైబర్ నేరగాళ్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అత్యంత కఠినమైన నిబంధనలను తెరపైకి తీసుకురానుంది.

    పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇలా ఎందుకు చేస్తోందంటే.. డబ్బులు పంపిస్తామని చెప్పి యూపీఐ మనీ రిక్వెస్ట్ లు పెట్టి సైబర్ నేరగాళ్లు అడ్డంగా దోచుకుంటున్నారు. యూపీఐ లో చెల్లింపులు జరిపేటప్పుడు డబ్బులు పంపిస్తున్నారని సందేశం పైన కనిపిస్తూనే ఉంటుంది. అయితే దీనిని కొంతమంది చూడకుండా అలాగే పిన్ నెంబర్ ఎంటర్ చేస్తారు. దీనివల్ల తమ ఖాతాలో ఉన్న డబ్బులను కోల్పోతారు. ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్న నేపథ్యంలో నేషనల్ పేమెంట్ స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల యూజర్లకు మెరుగైన, సురక్షితమైన చెల్లింపుల సౌకర్యం కలుగుతుందని భావిస్తోంది. ప్రపంచ దేశాల కంటే ఎక్కువగా భారత్ డిజిటల్ చెల్లింపులు వ్యవస్థను విపరీతంగా ప్రోత్సహిస్తున్నది. తాజాగా నటించిన మార్పుల ద్వారా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించబోతోందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు.