https://oktelugu.com/

Double Ismart First Review: డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది… సినిమా చూసిన సెన్సార్ సభ్యుల మైండ్ బ్లాక్! హైలెట్స్ ఇవే!

దర్శకుడు పూరి జగన్నాథ్-రామ్ పోతినేని కాంబోలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. డబుల్ ఇస్మార్ట్ మూవీ చూసిన సెన్సార్ సభ్యులు తమ అభిప్రాయం తెలియజేశారు. రామ్ పోతినేని ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ లేపే సమాచారం ఇచ్చారు.

Written By:
  • S Reddy
  • , Updated On : August 10, 2024 / 09:32 AM IST

    Double Ismart First Review

    Follow us on

    Double Ismart First Review: 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ భారీ హిట్. దర్శకుడు పూరి జగన్నాధ్ కి గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చిన చిత్రం అది. రామ్ పోతినేని సైతం పరాజయాలతో ఇబ్బందిపడుతున్న తరుణంలో ఇస్మార్ట్ శంకర్ రూపంలో హిట్ పడింది. ఇస్మార్ట్ శంకర్ రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. ఇస్మార్ట్ శంకర్ అనంతరం పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లైగర్ డిజాస్టర్ అయ్యింది. రామ్ పోతినేనికి కూడా తిరిగి ప్లాప్స్ మొదలయ్యాయి. దాంతో పూరి జగన్నాధ్-రామ్ పోతినేని మరోసారి కొలాబరేట్ అయ్యారు.

    ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ప్రకటించారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మి, పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో ప్రధాన విలన్ రోల్ సంజయ్ దత్ చేయడం విశేషం. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. సాయాజీ షిండే , అలీ, గెటప్ శ్రీను, మకరంద్ దేశ్ పాండే, ఝాన్సీ, ప్రగతి కీలక రోల్స్ చేస్తున్నారు .

    డబుల్ ఇస్మార్ట్ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ క్రమంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారు. డబుల్ ఇస్మార్ట్ మూవీ చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్ గా స్పందించారు. మూవీ అద్భుతంగా ఉందని వెల్లడించారని సమాచారం. డబుల్ ఇస్మార్ట్ మూవీ నిడివి 162 నిమిషాలు. డబుల్ ఇస్మార్ట్ A సర్టిఫికెట్ పొందింది. వైలెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, రొమాన్స్ పాళ్ళు ఎక్కువగా ఉన్న కారణంగా A సర్టిఫికెట్ జారీ చేశారు. చిన్న పిల్లలకు డబుల్ ఇస్మార్ట్ నిషిద్ధం.

    డబుల్ ఇస్మార్ట్ మూవీ బిగ్ బుల్(సంజయ్ దత్), ఉస్తాద్ శంకర్(రామ్ పోతినేని) మధ్య నడిచే మైండ్ గేమ్. అమరత్వం పొందాలని బిగ్ బుల్ తన మెమరీస్ శంకర్ మైండ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. కానీ ఆల్రెడీ శంకర్ మైండ్ లో మరొకరి జ్ఞాపకాలు నిక్షిప్తం చేసి ఉంటాయి. ఈ క్రమంలో ఉస్తాద్ శంకర్ ఏం చేశాడు? బిగ్ బుల్ కి ఎలా చెక్ పెట్టాడు? అనేది డబుల్ ఇస్మార్ట్ కథ…

    డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి ప్రధాన హైలెట్ హీరో రామ్ పోతినేని ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్. ఉస్తాద్ శంకర్ గా మాస్ మేనరిజమ్స్ తో రామ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇవ్వనున్నాడు. హీరోయిన్ కావ్య థాపర్ తో ఆయన కెమిస్ట్రీ సైతం బాగా కుదిరింది అంటున్నారు. రామ్-సంజయ్ దత్ కాంబినేషన్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి.

    డబుల్ ఇస్మార్ట్ మూవీలో మదర్ సెంటిమెంట్ సైతం జోడించారని సమాచారం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ట్విస్ట్ అలరించే అంశాలు. పూరి జగన్నాథ్ మార్క్ కామెడీ సైతం మనం ఎంజాయ్ చేయవచ్చని అంటున్నారు. మొత్తంగా డబుల్ ఇస్మార్ట్ మూవీతో పూరి జగన్నాథ్, రామ్ పోతినేని హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. సెన్సార్ సభ్యుల అభిప్రాయంలో డబుల్ ఇస్మార్ట్ మూవీ చాలా బాగుంది. ప్రేక్షకులు ఆద్యంతం ఎంజాయ్ చేస్తారు. ఇస్మార్ట్ శంకర్ కి మించి డబుల్ ఇస్మార్ట్ ఉంటుందట. ఇది రామ్ పోతినేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు.