Renault Duster 2025
Renault Duster 2025: రెనాల్ట్ డస్టర్ భారత మార్కెట్‌లోకి తిరిగి వచ్చేస్తోంది. ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ భారతదేశంలో డస్టర్‌ను కొంత కాలం క్రితం నిలిపేసింది. కానీ బ్రాండ్ దానిని తిరిగి తీసుకురావాలని ప్రణాళికలను పరిశీలిస్తోంది. కొత్త తరం రెనాల్ట్ డస్టర్ గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. మూడవ తరం రెనాల్ట్ డస్టర్ SUV ఇప్పటికే దక్షిణాఫ్రికాలో లాంచ్ చేసింది.ప్రారంభ ధర 489,999 రాండ్. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.23.36 లక్షల (ఎక్స్-షోరూమ్).
Also Read: ఐపీఎల్ లో ఓల్డెస్ట్, యంగెస్ట్ ప్లేయర్లు వీరే..
రెనాల్ట్ వచ్చే ఏడాది ఇండియాలో కొత్త తరం డస్టర్‌ను విడుదల చేయవచ్చు. కొత్త రెనాల్ట్ డస్టర్ ఒకసారి విడుదలైతే అది రెనాల్ట్ ఇండియా భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుంది. భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉన్న మోడల్‌తో పోలిస్తే మూడవ తరం రెనాల్ట్ డస్టర్ పూర్తిగా కొత్త డిజైన్‌తో వస్తుంది. కొత్త తరం SUV కొత్త డిజైన్, పూర్తిగా రీ డిజైన్ చేసిన ఇంటీరియర్లతో అద్భుతమైన లుక్ అందిస్తుంది. అలాగే, ఇది దక్షిణాఫ్రికా మార్కెట్లో మూడు వేర్వేరు పవర్‌ట్రెయిన్ ఆఫ్షన్లను కలిగి ఉంది.
మైల్డ్-హైబ్రిడ్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్
పవర్‌ట్రెయిన్ పరంగా, మూడవ తరం డస్టర్‌లో మూడు వేర్వేరు ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. 1.2-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. అలాగే 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటార్ కూడా ఉంది. 2021 వరకు భారతదేశంలో విక్రయించబడిన డస్టర్ 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. రెనాల్ట్ ఇండియాలో ఈ రెండు ఇంజన్ ఆఫ్షన్లను మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటి ట్రాన్స్‌మిషన్ ఆఫ్షన్లతో అందిస్తుంది.
భారతదేశంలో డిజైన్ ఎలా ఉంటుంది?
దక్షిణాఫ్రికా-స్పెక్ రెనాల్ట్ డస్టర్ ఈ SUV భారత మార్కెట్ కు అనుగుణంగా డిజైన్ చేశారు. ఈ కొత్త SUV వేరియంట్ మునుపటి మోడల్ మాదిరిగానే అదే సిల్హౌట్‌ను కలిగి ఉంది. అయితే, ఇది పూర్తిగా కొత్త ఫ్రంట్ ప్రొఫైల్, కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్, ముందు వెనుక కంప్లీట్ LED లైట్ ప్యాకేజీ కోసం కొత్త డిజైన్‌ను అందించారు.
కంప్లీట్ అప్ డేట్ ఇంటీరియర్
ఈ ఎస్యూవీ లోపలి భాగాన్ని కూడా పూర్తిగా రీడిజైన్ చేశారు. ఇది అనేక రెనాల్ట్ స్టైలింగ్ ఫీచర్లను కలిగి ఉంది. దక్షిణాఫ్రికా మార్కెట్-స్పెక్ మోడల్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిపే డ్యూయల్ డిజిటల్ స్క్రీన్‌లు ఉన్నాయి. అలాగే క్లైమేట్ కంట్రోల్‌తో కొత్తగా రూపొందించిన AC వెంట్లు, 360-డిగ్రీ కెమెరా, పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, టైప్-సి USB ఛార్జింగ్ పోర్ట్, పవర్ విండోస్, పవర్ మిర్రర్లు మొదలైనవి ఉన్నాయి.అలాగే లెవెల్-2 ADAS కూడా ఉంది.ఈ కారు 2025 చివరి కల్లా విడుదల అవుతుంది అని తెలుస్తుంది.