https://oktelugu.com/

Naga Vamshi : పవన్ కళ్యాణ్ కంటే ఎన్టీయార్ తో సినిమా చేయడం ఇష్టం అంటున్న నాగవంశీ…

Naga Vamshi  : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. స్టార్ హీరోలుగా వెలుగొందిన వారు సైతం సూపర్ సక్సెస్ లను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. ఇక సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ప్రతి హీరో టార్గెట్ కూడా పాన్ ఇండియా సినిమానే కావడం విశేషం... ఒక్కసారి పాన్ ఇండియా మార్కెట్ ను సంపాదిస్తే ఆటోమేటిగ్గా వాళ్ళ క్రేజ్ తారాస్థాయికి వెళ్ళిపోతుందని అందరూ భావిస్తున్నారు...

Written By: , Updated On : March 23, 2025 / 02:10 PM IST
Naga Vamshi

Naga Vamshi

Follow us on

Naga Vamshi  : సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్లు చేసిన సినిమాలను సూపర్ సక్సెస్ గా నిలపడానికి కష్టపడుతూ ఉంటారు. అయితే ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులను సేఫ్ జోన్ లో ఉంచడానికి దర్శకులు అనుక్షణం సినిమా కోసమే పరితపిస్తూ ఆ సినిమాని ఎలాగైనా సరే సక్సెస్ తీరాలకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత అయిన నాగవంశీ ప్రొడ్యూసర్ గా ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వచ్చాయి. వచ్చిన సినిమాలు వచ్చినట్టుగా భారీ విజయాలను సాధిస్తున్నాయి. ఇక ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో నాగ వంశీ తో మీకు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం ఇష్టమా? జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడం ఇష్టమా? ఒకేసారి వీళ్ళిద్దరితో అవకాశం వస్తే మీరు ఎవరితో సినిమా చేస్తారని ఒక ప్రశ్న అడిగినప్పటికి అందుకు సమాధానంగా నాగ వంశీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ గా ముందుకు సాగుతున్నాడు. అతన్ని మనం సినిమాలు చేయమని అడగకూడదు జనాలకి సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.

Also Read : మహేష్ బాబు ను ఫాలో అవుతున్న స్టార్ హీరో…కారణం ఏంటంటే..?

కాబట్టి అతన్ని అలాగే ఉండనిద్దాం… ఎన్టీఆర్ తో సినిమా చేయడం నాకు ఇష్టం అంటూ బదిలిచ్చాడు. ఇక ఈ సమాధానానికి పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతవరకు నిరాశ చెందుతున్నారు. నాగవంశీ పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గానే మాట్లాడాడు. కానీ ఆయన తో సినిమా చేస్తానని చెబితే బాగుండేది కదా అంటూ మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరి ఏది ఏమైనా కూడా నాగ వంశీ ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్ గా ముందుకు సాగుతున్నాడు. ఆయన బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు వచ్చినట్టుగా సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న క్రమంలో ఇకమీదట సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

అందుకే ఆయన బ్యానర్ లో సినిమా చేసిన దర్శకులకే మరోసారి అవకాశాలను ఇస్తూ వాళ్లతోనే ఎక్కువ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ బ్యానర్ లో వచ్చే సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Also Read : ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆ హీరోయిన్ కు స్టార్ స్టేటస్ ను కట్టబెడుతున్నారా..?