https://oktelugu.com/

Rapaka Varaprasad : టిడిపిలో ఆ నేత చేరికను బ్రేక్ వేసిన జనసేన!

Rapaka Varaprasad : జనసేన లో ఉండి ఉంటే రాపాక వరప్రసాద్( rapaka varaprasad ) మంత్రి అయ్యుండేవారు. 2019లో గెలవడంతో రాజోలు నియోజకవర్గం జనసేనకు కేటాయించి ఉండేవారు. కేటాయించారు కూడా. ఒకవేళ ఆయన జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ పోటీ చేసి ఉంటే భారీ మెజారిటీతో గెలిచి ఉండేవారు.

Written By: , Updated On : March 23, 2025 / 02:18 PM IST
Rapaka Varaprasad

Rapaka Varaprasad

Follow us on

Rapaka Varaprasad : 2019 ఎన్నికల్లో జనసేన( janasena ) బోణి కొట్టింది. ఆ ఎన్నికల్లో రాజోలు నుంచి గెలిచారు రాపాక వరప్రసాద్. కానీ అక్కడకు కొద్ది రోజులకే ఆయన జగన్మోహన్ రెడ్డికి జై కొట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అయితే 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అటు తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కానీ ఆయనకు కూటమి పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. దానికి జనసేన అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కారణం. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ జనసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దానికి బ్రేక్ పడినట్లు సమాచారం.

Also Read : బిజెపిని వ్యతిరేకించని జగన్!

* జనసేన లో ఉంటే తప్పకుండా మంత్రి
వాస్తవానికి జనసేన లో ఉండి ఉంటే రాపాక వరప్రసాద్( rapaka varaprasad ) మంత్రి అయ్యుండేవారు. 2019లో గెలవడంతో రాజోలు నియోజకవర్గం జనసేనకు కేటాయించి ఉండేవారు. కేటాయించారు కూడా. ఒకవేళ ఆయన జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ పోటీ చేసి ఉంటే భారీ మెజారిటీతో గెలిచి ఉండేవారు. తప్పకుండా ఎస్సీ కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కి ఉండేది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి అనవసరంగా చేతులు కాల్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సైతం చివరి నిమిషంలో రాజోలు అసెంబ్లీ టికెట్ వేరే నేతకు ఇచ్చారు. అమలాపురం పార్లమెంట్ స్థానానికి మార్చారు రాపాకను. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయేసరికి అసలు తత్వం బోధపడింది. అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని భావించిన వరప్రసాద్.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.

* టిడిపిలో చేరాలని నిర్ణయం..
తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) చేరాలని భావిస్తున్నారు రాపాక వరప్రసాద్. జనసేనలో చాన్స్ లేకపోవడంతో టిడిపి బెటర్ అన్న ఆలోచనకు వచ్చారు. ప్రస్తుతం రాజోలులో టిడిపికి నాయకత్వం లేదు. ఇన్చార్జిగా ఉన్న గొల్లపల్లి సూర్యారావు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రాజోలు నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే గొల్లపల్లి సూర్యారావు బయటకు వెళ్లిపోవడంతో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అవసరం. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు రాపాక వరప్రసాద్ టిడిపిలోకి వచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జనసేన అడ్డంకిగా మారింది. జనసేన అభ్యంతరాలతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది.

* టిడిపి నేతలతో కలిసి..
ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా( East Godavari district) టిడిపి నేతలతో తిరుగుతున్నారు రాపాక వరప్రసాద్. మంత్రి నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు తదితరులతో కలిసి టిడిపిలో చేరేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అయితే కూటమి పార్టీలో ఎవరు చేరాలన్నా.. మిగతా పార్టీల గ్రీన్ సిగ్నల్ తప్పనిసరి. దీంతో రాపాక టిడిపిలో చేరాలంటే జనసేన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read : తెలంగాణలో ఎన్డీఏ.. కెసిఆర్ నోట చంద్రబాబు మాట అందుకేనా?