https://oktelugu.com/

Renault Duster 2024 : మార్కెట్లోకి కొత్త డస్టర్.. ఫీచర్స్, ధర ఎలా ఉండబోతున్నాయో తెలుసా?

Renault Duster 2024 : ఒకప్పుడు కార్లు వినియోగించేవారి సంఖ్య తక్కువ. కానీ ఈ తరుణంలో కొన్ని కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేలా విభిన్నమైన మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా వచ్చిన వాటిల్లో రెనాల్డ్ కంపెనీకి చెందిన డస్టర్ ఒకటి. 2012లో భారత్ లో రిలీజ్ అయినా డస్టర్ కొనుగోలుదారుల నుంచి విపరీత ఆదరణ పొందింది. కొందరు హోదా కోసం దీనిని కొనుగోలు చేసిన వారున్నారు. అయితే కొన్నికారణాల వల్ల 2022లో ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివారు. అయితే […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 24, 2024 / 10:15 AM IST

    Renalt Duster

    Follow us on

    Renault Duster 2024 : ఒకప్పుడు కార్లు వినియోగించేవారి సంఖ్య తక్కువ. కానీ ఈ తరుణంలో కొన్ని కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేలా విభిన్నమైన మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా వచ్చిన వాటిల్లో రెనాల్డ్ కంపెనీకి చెందిన డస్టర్ ఒకటి. 2012లో భారత్ లో రిలీజ్ అయినా డస్టర్ కొనుగోలుదారుల నుంచి విపరీత ఆదరణ పొందింది. కొందరు హోదా కోసం దీనిని కొనుగోలు చేసిన వారున్నారు. అయితే కొన్నికారణాల వల్ల 2022లో ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివారు. అయితే అప్డేట్ ఫీచర్స్ తో పాటు లేటేస్ట్ డిజైన్ తో మళ్లీ డస్టర్ రాబోతున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఇంతకీ ఆ కారు ఎలా ఉండబోతుందంటే?

    కొత్త రెనాల్ట్ డస్టర్ గురించి కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కొందరు నిపుణులు దీనిని అంచనా వేస్తున్నారు. గతంలో ఉన్న మోడల్ కు కొత్త హంగులను తీర్చి దిద్దనున్నారు. ఇది 4.34 మీటర్ల పొడవుతో తయారు చేయనున్నారు. అవుట్ గోయింగ్ మోడల్ కంటే పొడవుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎస్ యూవీ అయినప్పటికీ 7 సీటర్ తో కూడా వచ్చే అవకాశం ఉంది. గతంలో ఉన్న డస్టర్ లో స్క్వేర్డ్ ఆఫ్ వీల్ ఆర్చ్ లు, రూఫ్ రెయిల్ లు ఉండేవి. కానీ కొత్తదానిలో 18 అంగుళాల బ్లాక్ అవుట్ అల్లాయ్ వీల్స్ ఉండనున్నాయి. వైఆకారపు టెయిల్ లైట్స్ వెనుక భాగం ప్రత్యేకంగా ఉంటుంది.

    ఇందులో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్, ఏసీ నియంత్రణ సిస్టమ్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ ఆటో , ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ సిస్టమ్ఆకర్షిస్తాయి. ఇంజిన్ విషయానికొస్తే ఇందులో మూడు ఇంజన్లు ఉన్నాయి. 1.6 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ హైబ్రిడ్ ను కలిగి ఉంది. అలాగే ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కూడా జోడించారు. ఇవి 1.2kWh బ్యాటరీతో పనిచేస్తుంది. 80 శాతం వరకు ఇది ఎలక్ట్రిక్ వాహనం అనుకోవచ్చు. రెండో ఇంజన్ 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ తో పాటు 48 V స్టార్టర్ మోటార్ ఉంది. మూడో ఇంజిన్ 1.0 లీటర్ పెట్రోల్ ఎల్ పీజీ ఎంపికతో మార్కెట్లోకి రానుంది.

    కొత్త డస్టర్ 2025 ద్వితీయార్థంలో మార్కెట్లోకి రానుంది. ఇది స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా కు పోటీ ఇవ్వనుంది. ధర విషయానికొస్తే కొత్త డస్టర్ ను రూ.10.00 లక్షల ప్రారంభ ధరతోవిక్రయించే అవకాశం ఉంది. అలాగే టాప్ వేరియంట్ రూ.15.00 లక్షలతో విక్రయించనున్నారు. అయితే పాత డస్టర్ కంటే కొత్త డస్టర్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.