Homeబిజినెస్Redmi Note 17 Pro: ఒక ఫోన్.. రెండు పేర్లతో రిలీజ్.. ఫీచర్లు చూస్తే షాక్...

Redmi Note 17 Pro: ఒక ఫోన్.. రెండు పేర్లతో రిలీజ్.. ఫీచర్లు చూస్తే షాక్ తినాల్సిందే..

Redmi Note 17 Pro: Xiaomi సబ్ బ్రాండ్ అయిన రెడ్‌మి ఇటీవల చైనా మార్కెట్లో కొత్త ఫోన్ విడుదల చేసింది. ఈ మొబైల్ అంతర్జాతీయ ‘NBD’ లిస్టింగ్‌లో కనిపించింది. విశేషమేంటంటే.. ఇదే డేటాబేస్‌లో ఈ ఫోన్ ఒక పోకో వేరియంట్‌గా కూడా రిజిస్టర్ అయ్యింది. అంటే గ్లోబల్ మార్కెట్లలోని కొన్ని దేశాల్లో ఇది రెడ్‌మి పేరుతో మరికొన్ని మార్కెట్లలో రీబ్రాండెడ్ పోకో మోడల్‌గా విడుదల కానుందని లీకులు స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ ఫోన్ కు ఉన్న స్పెషల్ ఏంటో తెలుసుకుందాం..

NBD డేటాబేస్ ప్రకారం… రెడ్ మీ నుంచి Redmi Note 17 Pro స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ గ్లోబల్ మోడల్ నంబర్ 2607DRA18G గా ఉంది. అదే సమయంలో పోకో వేరియంట్ మోడల్ నంబర్ 2607DPC18G గా నమోదైంది. చైనా మార్కెట్లో ఈ ఫోన్ 8GB లేదా 12GB RAM తో పాటు 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్లతో ఉండనుంది. గ్లోబల్ వేరియంట్ మాత్రం ప్రారంభంలో కాస్త తక్కువ కాన్ఫిగరేషన్లయిన 4GB ర్యామ్ 64GB… 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది 6.83 అంగుళాల AMOLED డిస్ ప్లే ఉండనుంది. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్ తో పనిచేస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు గరిష్టంగా 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. మొబైల్ స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ను ఏర్పాటు చేశారు. అలాగే ఇందులో స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్‌ను ఉపయోగించారు.

రెడ్‌మి నోట్ 17 ప్రో చైనీస్ వేరియంట్‌లో ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీతో రానుంది. ఈ బ్యాటరీకి 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేయనుంది. అయితే గ్లోబల్ వేరియంట్‌లో రేటెడ్ కెపాసిటీ కాస్త తగ్గి 8,500mAh బ్యాటరీని ఉంచారు. కెమెరాల పరంగా చూస్తే… ఈ మొబైల్ వెనుక వైపు OIS సపోర్ట్ ఉంది. అలాగే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఈ మొబైల్ లో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే నీరు, ధూళి నుంచి రక్షణ కోసం ఏకంగా IP66, IP68, IP69 రేటింగ్స్‌ ఉండడంతో ఎంతటి కఠినమైన వాతావరణ పరిస్థితులనైనా.. అధిక పీడనం గల వేడి నీటి ధారలను సైతం ఇది తట్టుకోగలదు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular